Site icon HashtagU Telugu

saturday: శనివారం ఈ ఐదు రకాల వస్తువులు దానం చేస్తే చాలు.. అదృష్టం పట్టిపీడించడం ఖాయం?

Mixcollage 20 Dec 2023 05 43 Pm 5536

Mixcollage 20 Dec 2023 05 43 Pm 5536

సనాతన ధర్మం ప్రకారం శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలాలను ఇచ్చే వ్యక్తిగా పరిగణిస్తారు. అలాగే శని దేవుని న్యాయదేవుడిగా కూడా పిలుస్తూ ఉంటారు. మనం చేసే మంచి చెడు పనులను బట్టి శనీశ్వరుడు మనకు కష్టసుఖాలను ఇస్తాడని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. శనీశ్వరుడి అనుగ్రహం ఒక్కసారి కలిగింది అంటే చాలు ఎంతటి బీదవారైనా సరే కోటీశ్వరులు అవ్వాల్సిందే. శనివారం శనీశ్వరుడికి ప్రీతికరమైన రోజు. ఆరోజున స్వామి వారిని పూజించడంతోపాటు కొన్ని రకాల వస్తువులు దానం చేస్తే చాలు ఆయన అనుగ్రహం తప్ప కలుగుతుంది. ఎందుకంటే ఈ దానాలు శనైశ్చ‌రుడిని శాంతింప‌జేసి, ప్రసన్నం చేసుకునేందుకు దోహదం చేస్తాయి.

ఫ‌లితంగా ఆయ‌న‌ తన భక్తులను రక్షిస్తాడు. మరి శనివారం ఎటువంటి వస్తువులను దానం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శనివారం రోజు దానం చేయాల్సిన వాటిలో ఆవనూనె కూడా ఒకటి. ఈ ఆవనూనెను దానం చేయడం లేదా ఆవనూనె ఉపయోగించడం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఒకవేళ శని కారణంగా మీ జీవితంలో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే, శనివారం రోజు ఎక్కువగా ఆవనూనెను ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. శనివారం నాడు ఒక ఇనుప పాత్రలో ఆవాల నూనె తీసుకుని, అందులో ఒక రూపాయి నాణెం వేసి, ఆ నూనెలో మీ ముఖం చూసుకుని తర్వాత పేదవారికి దానం చేయాలి. లేదంటే మ‌ర్రిచెట్టు కింద ఉంచాలి.

అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చాలా కాలంగా మిమ్మ‌ల్ని వ్యాధులు బాధిస్తుంటే, శనివారం సాయంత్రం ఒక పేద వ్యక్తికి న‌ల్ల‌ని వ‌స్త్రాలు, చెప్పులు దానం చేయాలి. అలాగే ఆ వ్యక్తి నుంచి ఆశీర్వాదం పొందాలి. ఇలా చేస్తే క్రమంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదేవిదంగా శనివారం రోజు ఇనుప పాత్రలను దానం చేయడం చాలా శుభప్రదం. మీ జాతకంలో శని ప్రమాద కారకంగా ఉంటే అట్ల పెనం, పటకర వంటి ఇనుప పాత్రలను అవి అవసరమున్న‌ వ్యక్తులకు దానం చేయాలి. ఈ రెమెడీ ద్వారా ప్రమాదాలను నివారించడం వ‌ల్ల‌ మీరు సురక్షితంగా ఉంటారు. అలాగే మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, శనివారం సాయంత్రం 1.25 కిలోల నల్ల మిన‌ప్పప్పు లేదా నల్ల నువ్వులను దానం చేయాలి. ఇలా వరుసగా రుసగా ఐదు శనివారాలు ఈ పరిహారం పాటించాలి. మీరు ఈ వస్తువులను దానం చేయ‌డం ద్వారా త్వరలోనే అన్ని డబ్బు సంబంధిత సమస్యలు మీ జీవితం నుండి తొలగిపోతాయి.