Site icon HashtagU Telugu

Vastu Tips: పాత బట్టలు పడేస్తున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Vastu Tips

Vastu Tips

మామూలుగా మనం బట్టలు వినియోగించిన తర్వాత అవి పాతవి అయిపోయాయని లేదంటే అవి సరిపోవడం లేదని సైడ్ చిన్నగా అయిపోయాయి అని వేరే వాళ్లకు దానం చేయడం లేదంటే బయట పారేయడం లాంటివి చేస్తూ ఉంటారు. చాలా మంది పేదవారికి లేదంటే బిక్షాటన చేసే వారికి, పేపర్లు ఏరుకునే వారికి దానం చేస్తూ ఉంటారు. పనికి రాని బట్టలను పారేస్తూ ఉంటారు. కానీ బట్టలు పడేసే ముందు ఖచ్చితంగా కొన్ని విషయాలు పాటించాలట. మరి కొంత మంది పాత బట్టలను దానం కూడా చేస్తూ ఉంటారు. పాత బట్టలు దానం చేసే విషయంలో కూడా కొన్నింటిని గుర్తు పెట్టుకోవాలని పండితులు చెబుతున్నారు.

ఏవి పడితే అవి దానం చేయకూడదట. కాస్త మంచిగా ఉన్న బట్టలు ఎదుటి వాళ్లకు ఉపయోగ పడేవి మాత్రమే దానం చేయాలని చెబుతున్నారు. అలాగే సాధ్యమైనంత వరకు వాడేసిన బట్టలు దానం చేయకుండా ఉంటే మంచిట. ఎందుకంటే అప్పటి వరకూ సదరు వ్యక్తి ధరించిన బట్టలకు కూడా వ్యక్తి భావోద్వేగాలు, అనుభవాలు, శక్తి వంటివి కూడా ఎదుటి వ్యక్తి వెళ్లే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. కాబట్టి దానం చేసేటప్పుడు ఆలోచించి చేయాలట. గురువారం రోజు బట్టలు దానం చేయకూడదని చెబుతున్నారు. మీరు బట్టలు దానం చేసిన వ్యక్తి నుంచి కనీసం రూపాయి అయినా తీసుకోవాలట.

సాధ్యమైనంత వరకు కొత్త బట్టలు దానం చేసేందుకు ట్రై చేయాలి. చలి కాలం, వర్షా కాలంలో రగ్గులు, స్వెటర్లు, దుప్పట్లు వంటివి దానం చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందట. మీరు పాత బట్టలను దానం చేయాలి అనుకోవడం మంచిదే కానీ చిరిగిన బట్టలు అసలు దానం చేయకూడదని అలాంటి విధానం చేసిన కూడా దాన ఫలితం దక్కదని చెబుతున్నారు.