Donate: దానం ఫలం దక్కాలంటే పేదవారికి అవి దానం చేయాల్సిందే?

మామూలుగా అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అని అంటూ ఉంటారు. ఒక్క అన్నదానం మాత్రమే కాకుండా వస్తుదానం డబ్బు దానం వల్ల కూడ

  • Written By:
  • Publish Date - August 29, 2023 / 09:50 PM IST

మామూలుగా అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అని అంటూ ఉంటారు. ఒక్క అన్నదానం మాత్రమే కాకుండా వస్తుదానం డబ్బు దానం వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మామూలుగా దానం అయిదు రకాలు అంటారు. ధర్మం, అర్థం, భయం, కామం, కారుణ్యం. వీటివల్ల దాతకు ఇహలోకంలో కీర్తి, పరలోకంలో ఉత్తమగతీ కలుగుతాయి. అసూయ లేకుండా ఇస్తే అది ధర్మదానం. యాచకులు ప్రశంసిస్తూ ఉండగా ఇస్తే అర్థదానం. దానం ఇవ్వకపోతే ఏం చేస్తారో అనే భయంతో ఇచ్చేది భయదానం.

ఇష్టమైన వ్యక్తికి ఇస్తే కామ దానం. పేదవాడికి జాలితో ఇచ్చేది కారుణ్య దానం. దానం అనేది పేదవారికి ఇష్ట పూర్వకంగా దానం చేయాలి. గుళ్ళో హుండిలో వేస్తే వచ్చి పుణ్యం కంటే గుడి దగ్గర మెట్లపై ఉన్న యాచకులకు దానం చేయడం వలన విశేష పుణ్యఫలం దక్కుతుంది. అలాగే మరో ముఖ్య విషయం ఏమిటంటే దానం చేసేది గుప్తంగా చేయాలి. అందరికి తెలియాలని ఆలోచించకూడదు. చేసిన దానం వెంటనే మర్చిపోవాలి. దానం చేసేప్పుడు మనకు నచ్చిన దేవునికి అర్పితమస్తూ కృష్ణార్పితమస్తూ అనుకోవాలి.

ఇలా చేయడం వలన నేరుగా దైవానికి ఇచ్చిన పుణ్యఫలం దక్కుతుంది. కొంతమంది ఒక్క పది రూపాయలు దానం చేస్తే ఆ విషయం గురించి పదిమందికి చెప్పుకొని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల దాన ఫలం దక్కదు. అలాగే దానం చేసే ముందు ఏదైనా కానీ ప్రతిఫలం ఆశించి దానం చేయకూడదు. అలా చేయడం వల్ల దానం చేసిన ఫలితం దక్కదు. కాబట్టి ఎవరికైనా ఏదైనా దానం చేసేటప్పుడు మంచి మనసుతో మనసులో ఎటువంటి ఆలోచనలు స్వార్ధాలు లేకుండా ప్రేమగా మనస్ఫూర్తిగా దానం చేయడం వల్ల ఆ దాన ఫలితం దక్కుతుంది.