సూర్యగ్రహణం, చంద్రగ్రహణం…ఈ ఏడాది 15రోజుల తేడాతో రెండు గ్రహణాలు వచ్చాయి. దీపావళినాడు సూర్యగ్రహణం ఏర్పడింది. కార్తీక పౌర్ణమి రోజున నవంబర్ 8న చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం భారత్ లో చాలా ప్రాంతాల్లో కనిపించదు. అయితే ఈ ఏడాది రెండవ, చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 25న ఏర్పడింది. ఇప్పుడు కార్తీకపౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడునుంది. ఇది పూర్తి చంద్రగ్రహణం. భారత్ లో చివరి చంద్రగ్రహణం కనిపించడం వల్ల సూతకం కాలం చెల్లుతుంది. దాదాపు 1గంటపాటు ఈ గ్రహణం కనిపించనుంది. అయితే చంద్రగ్రహణం నాడు ఈ వస్తువును దానం చేసినట్లయితే మీ దోషాలన్నీ తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ వస్తువులేంటో తెలుసుకుందాం.
తెల్లముత్యాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం…మీరు ఉద్యోగం కోసం వెతుకుతుంటే…చంద్ర గ్రహణం రోజు తెల్లటి ముత్యాలు లేదా తెల్ల ముత్యాలతో చేసిన నగలను దానం చేయడం వల్ల మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి.
పంచదార లేదా తెల్లటి వస్త్రం
మీఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేదా నిత్యం గొడవలు జరుగుతుంటే చంద్రగ్రహణం రోజు చక్కెర లేదా తెల్లని వస్త్రాలను దానం చేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. వివాదాలకు పరిష్కారం లభిస్తుంది.
పాలు లేదా అన్నం
మీరు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటే…చంద్రగ్రహణం రోజు పాలు లేదా అన్నం దానం చేయండి. మత విశ్వాసాల ప్రకారం బియ్యం దానం చేయడం శ్రేయస్కారం. పాలు దానం చేయడం వల్ల విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
వెండి నాణెం
మీ ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్నట్లయితే గ్రహణం రోజు గాజుపాత్రలో నీరు పోసీ అందులో వెండి నాణెం ఉంచండి. ఇప్పుడు జబ్బు పడిన వ్యక్తి ని ఆ గిన్నెలో తన ముఖాన్ని చూసి నాణేలతోపాటు ఈ గిన్నెను దానం చేయండి. ఇలా చేస్తే మంచి ప్రయోజనం పొందుతారు.
గ్రహణం 05.28గంటలకు ప్రారంభమై 07.26గంటలకు ముగుస్తుంది. భారత్ లో కనిపిస్తుంది కాబట్టి సూతక కాలం కూడా చెల్లుబాటవుతుంది.