Site icon HashtagU Telugu

Secret Donation: ఈ వస్తువులను రహస్యంగా దానం చేస్తే చాలు.. అంతులేని సంపద మీ సొంతం?

Mixcollage 22 Dec 2023 07 45 Pm 8150

Mixcollage 22 Dec 2023 07 45 Pm 8150

మామూలుగా దానధర్మాలు చేయడం వల్ల ఎన్నో రకాల ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతూ ఉంటారు. మనకు ఉన్నంతలోనే వస్త్రదానం, అన్నదానం, డబ్బు దానం లాంటివి చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతూ ఉంటారు. అందుకే ఆలయాల దగ్గర గుడి నుంచి బయటికి వచ్చేటప్పుడు బిక్షాటన చేసే వాళ్లకు డబ్బులను ఇస్తూ ఉంటారు. కేవలం ఆలయాల దగ్గర మాత్రమే కాకుండా రోడ్డుపై ఎక్కడైనా బిక్షాటన చేసే వాళ్ళు అలాగే పేద ప్రజలకు దానధర్మాలు చేయడం చాలా మంచిది. మనం ఏ ధర్మం చేసినా ఫలితం మనకే కాదు మన తర్వాతి తరానికి కూడా దక్కుతుందని పెద్ద‌లు చెబుతారు.

అయితే, హైంద‌వ‌ ధ‌ర్మంలో సాధారణ దానాల‌ కంటే రహస్యంగా చేసే గుప్త దానాల‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. మనం దానం చేసే విషయం దానం చేస్తున్న విషయం ఎవరికీ చెప్పకుండా రహస్యంగా దానం చేయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు. కొందరు దానం చేసి పదిమందికి చెప్పుకుంటూ చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా చేయడం వల్ల దానం చేసిన ఫలితం కూడా దక్కదు. కానీ రహస్యంగా దానం చేయడం వల్ల దురదృష్టం కూడా అదృష్టంలా మారి లక్ష్మీ అనుగ్రహం తప్పక కలుగుతుంది. మరి అలా ఎటువంటి వస్తువులను రహస్యంగా దానం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేసవికాలంలో పండ్లను రహస్యంగా దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. అయితే కట్ చేసిన పండ్లను కాకుండా ఫ్రెష్ గా దొరికే పండ్లను తీసుకొని పేదలకు బిక్షాటన చేసే వాళ్లకు దానం చేయడం మంచిది.

సంతానం కావాలనుకునే వారు వేసవిలో రహస్యంగా పండ్లను దానం చేయాలి. అదేవిధంగా వేసవికాలంలో మంచినీటిని దానం చేయడం వల్ల దాహం తీర్చినట్లు అవుతుంది. దాంతో భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. భ‌గ‌వంతుడు సంతోషించి మీపై క‌రుణ క‌టాక్షాలు చూపుతాడు. వేసవి కాలంలో మట్టి కుండ లేదా శీతల పానీయం దానం చేయాలి. ఇది చాలా పుణ్యాన్ని ఇస్తుంది. మ‌న సంస్కృతిలో బెల్లం దానం చేయ‌డానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. రహస్యంగా బెల్లం దానం చేయడం వల్ల జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది. మీ జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే, మీరు బెల్లం రహస్యంగా దానం చేయాలి.

బెల్లం రహస్య దానం కారణంగా, గ‌తంలో ఆగిపోయిన మీ పనులన్నీ మళ్లీ ప్రారంభమవుతాయి. మీరు జీవితంలో విజయవంతమైన వ్యక్తి అవుతారు. ఎండాకాలంలో శ‌న‌గ‌లు తినడం మంచిది. అటువంటి పరిస్థితిలో, వేసవి కాలంలో శ‌న‌గ‌ల‌ను రహస్యంగా దానం చేస్తే రెట్టింపు ఫలితం ద‌క్కుతుంది. దీనితో పాటు, ఒక వ్యక్తి జాతకంలో బృహస్పతి స్థానం బలహీనంగా ఉంటే, అత‌ను శ‌న‌గ‌ల‌ను రహస్యంగా దానమివ్వాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ మీ అదృష్టాన్ని పెంచుతుంది, బృహస్పతి స్థానాన్ని బలపరుస్తుంది. వేసవిలో ప్రజలు పెరుగు ఎక్కువగా తీసుకుంటారు. అటువంటి పరిస్థితిలో, పెరుగును రహస్యంగా దానం చేయడం కూడా ఈ సీజన్‌లో శుభప్రదంగా పరిగణిస్తారు. తియ్య‌టి పెరుగు రహస్యంగా దానం చేయ‌డం ద్వారా జాతకంలో శుక్ర గ్రహం స్థానాన్ని బలోపేతం చేస్తుంది.