Site icon HashtagU Telugu

Sunday: ఆదివారం రోజు ఈ వస్తువులను దానం చేస్తే చాలు.. మీ ఇంట కాసుల వర్షమే?

Mixcollage 16 Jan 2024 04 04 Pm 1032

Mixcollage 16 Jan 2024 04 04 Pm 1032

హిందువులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని ప్రత్యేకంగా భక్తి శ్రద్దలతోతో పూజిస్తూ ఉంటారు. ఒక్క వారం ఒక దేవుడికి అంకితం చేయబడింది. అలా ఆదివారం సూర్యభగవానుడికి అంకితం చేయబడింది.ఆదివారం నాడు సూర్యుడిని పూజిస్తారు. సనాతన ధర్మంలో సూర్యుడిని గ్రహాలకు రాజుగా భావిస్తారు. అందుకే ఆదివారం నాడు సూర్యదేవుడిని పద్ధతి ప్రకారం పూజించాలని చెప్తారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని కూడా నమ్ముతారు. అలాగే ఈ రోజు దానం చేయాలనే నియమం కూడా ఉంది. ఈ దానం వల్ల మీ జీవితంలోని అన్ని రకాల బాధల నుంచి ఉపశమనం పొందుతారట.

ఆదివారం రోజు కొన్ని రకాల వస్తువులు దానం చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితులు మీ స్థితిగతులు మెరుగుపడటంతో పాటు మీ ఇంట కాసుల వర్షం కురుస్తుంది అంటున్నారు పండితులు.. మరి ఆదివారం రోజు ఎలాంటి వస్తువులు దానం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆదివారం నాడు బెల్లం దానం చేయాలి. ఈ దానం వల్ల మీరు సూర్యభగవానుడిని ప్రసన్నం చేసుకుంటారు. అలాగే సూర్య భగవానుడి అనుగ్రహం మీపై ఉంటుంది. బెల్లం దానం చేయడం వల్ల మీ జీవితంలోని ఎన్నో కష్టాలు తొలగిపోతాయి. అలాగే సూర్య భగవానుడి ఆశీస్సులతో మీ జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుంది.

ఆదివారం నాడు బెల్లాన్ని, బియ్యాన్ని నీటిలో ప్రవహించనివ్వడం శుభప్రదంగా భావిస్తారు. ఈ పరిహారాన్ని చేయడం వల్ల సూర్యభగవానుడి దయ మీ పట్ల ఉంటుంది. ఆయన అనుగ్రహం కూడా మీపై ఉంటుంది. అదేవిధంగా ఆదివారం నాడు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు నుదుటిపై ఎర్రని తిలకాన్ని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పనిలో ఎదురయ్యే ఇబ్బందులు కొన్ని రోజుల్లో తొలగిపోతాయి. అలాగే అశుభ గ్రహాల ప్రభావం కూడా పోతుంది. ఈ రోజు కాపర్ ను దానం చేయడాన్ని కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ దానం వల్ల మీ రంగంలో పురోగతికి బాటలు పడతాయి. అలాగే సూర్యభగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది.