Donate on Shani Jayanti: శని జయంతి నాడు మీ రాశిని బట్టి ఇవి దానం చేయండి.. మీ పనులన్నీ ఫలిస్తాయి..!!

ఈ ఏడాది మే30న శనిజయంతి వస్తుంది. శనిదేవుడు అమావాస్యనాడు జన్మించాడు.

  • Written By:
  • Publish Date - May 28, 2022 / 07:05 AM IST

ఈ ఏడాది మే30న శనిజయంతి వస్తుంది. శనిదేవుడు అమావాస్యనాడు జన్మించాడు. శని జయంతి సందర్భంగా మీరు శనిదేవుని అనుగ్రహాన్ని పొందేలా కార్యాలను ఇచ్చే శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే…మీరు కొన్ని పనులు చేయాలి. శనిదేవుని అనుగ్రహంతో అన్ని కార్యాలు ఫలిస్తాయి. బాధ తొలగిపోతుంది. పూజతోపాటుగా శని జయంతి నాడు దానం కూడా చేయవచ్చు. ఈ రోజు మీ రాశిని బట్టి వస్తువులను దానం చేస్తే మంచిది. శని జయంతి నాడు రాశి ప్రకారం చేయాల్సిన విషయాల గురించి తెలుసుకుందాం.

1. మేషరాశి: మేషరాశివారు ఆవనూనె, నల్లనువ్వులు దానం చేస్తే మంచిది.
2. వృషభ రాశి: ఈ రాశివారు శని జయంతి రోజున నల్ల దుప్పట్లు దానం చేయాలి.
3. మిథున రాశి: ఈ రాశివారు నల్లని వస్త్రాలు దానం చేయాలి.
4.కర్కాటక రాశి: పెసరపప్పు, నల్ల నువ్వులు, ఆవ నూనె దానం చేయాలి.
5. సింహరాశి: ఈ రాశివారు సింహరాశికి చెందిన ఓం వరేణాయ నమ:మంత్రాన్ని జపించండి.
6. కన్యా రాశి: నల్లగొడుగు, తోలు పాదరక్షలను దానం చేయండి.
7. తులా రాశి, వృశ్చిక రాశి : నల్లని వస్త్రాలు, నల్లగొడుగు, ఆవాల నూనె , ఇనుము దానం చేయండి.
8. ధనుస్సు రాశి: ఓం ప్రాం ప్రిం ప్రౌం సః శనయే నమః అనే మంత్రాన్ని జపించాలి.
9.మకరరాశి: జంతువులు, పక్షులకు ధాన్యం నీరు ఇవ్వాలి.
10 కుంభ రాశి: మందులు
11. మీన రాశి: ఆవాల నూనె, నల్ల నువ్వులు, మందులు మొదలైనవి దానం చేయండి.