ఈనెల అనగా అక్టోబర్ 31వ తేదీన దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకోనున్నారు. అయితే ఈ దీపావళి పండుగ రోజున దీపాలు వెలిగించడం టపాసులు పేల్చడం, పిండివంటలు చేసుకుని తినడం అన్నది కామన్. అయితే ఈ రోజున దానధర్మాలు చేస్తే అంతా మంచి జరుగుతుందని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు పండితులు. మరి ఈ దీపావళి పండుగ రోజు ఏ రాశి వారు ఎలాంటి వస్తువులు దానం చేయాలి అన్న విషయానికి వస్తే…
ముందుగా మేష రాశి విషయానికి వస్తే.. ఈ రాశి వారు దీపావళి పండుగ రోజున స్వెటర్లు దుప్పట్లు, శాలువాలు వంటివి దానం చేయడం వల్ల అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు.
ఇక వృషభ రాశి వారు దీపావళి పండుగ రోజు స్వీట్లు మిఠాయిలు వంటివి దానం చేయడం పంచడం వల్ల అది వారికి శుభ ఫలితాలను అందిస్తుందట. చిన్నపిల్లలకు కూడా ఈ స్వీట్లు మిఠాయిలు పంచి పెట్టవచ్చని చెబుతున్నారు.
మిథున రాశి వారు దీపావళి పండుగ రోజున శుభ ఫలితాలు పొందడం కోసం శ్రేయస్సు కోసం పక్షులకు ఆహారాన్ని నీరు పెట్టాలని చెబుతున్నారు.
అలాగే కర్కాటక రాశివారు ఈ దీపావళి పండగ రోజున లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవిని పూజించిన తర్వాత ఎవరికైనా పేదలకు మిన పప్పును దానం చేయాలట. ఇలా చేయడం వల్ల కర్కాటక రాశివారికి శుభం జరుగుతుందని చెబుతున్నారు.
అదేవిధంగా సింహ రాశివారు ఈ దీపావళి రోజున నవ ధాన్యాలు పేదలకు దానం చేయాలట. ఇలా పేదలకు దానం చేయడం వల్ల కుటుంబంలో ఉన్న ధన సమస్యలు, పేదిరకం తొలగిపోతుందని చెబుతున్నారు.
కన్యా రాశి వారు ఈ దీపావళి పండుగ రోజున మీ ఇంటి సమీపంలో ఉన్న శనీశ్వర ఆలయానికి వెళ్లి ఆవనూనె దానం చేయాలని చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఆ రాశి వారికి ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయట.
తులా రాశి వారు దీపావళి పండుగ రోజున పేదలకు ఆహారం లేదంటే డబ్బులు దానం చేయడం మంచిదట. ఇలా చేస్తే వారికి అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి వారు దీపావళి పండుగ రోజున వినాయకుడిని లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించి ఆ తర్వాత అవసరం ఉన్న వారికి దుప్పట్లు దానం చేయడం వల్ల అంతా మంచే జరుగుతుందట.
అలాగే ధనస్సు రాశి వారు దీపావళి పండుగ రోజున ఏదైనా ఆహారం అరటి ఆకులో పెట్టి ఆవుకు నైవేద్యంగా పెట్టడం వల్ల అంతా మంచే జరుగుతుందని కోరుకున్నవి నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.
మకర రాశి వారు దీపావళి పండుగ రోజున ఏదైనా ఒక రకం అప్పును దానం చేయడం వల్ల అంతా మంచి జరుగుతుందని ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెబుతున్నారు.
కుంభ రాశి వారు దీపావళి పండుగ రోజు కొత్త వస్తువులను లేదంటే ఆహారాన్ని పేదలకు, అనాధ పిల్లలకు దానం చేయడం వల్ల సంతోషకరమైన జీవితం లభిస్తుందని చెబుతున్నారు.
మీన రాశివారు దీపావళి రోజున ఏదైనా పేద కుటుంబానికి చెందిన ఎవరైనా విద్యార్థికి విద్యా దానం చేయడం వల్ల మీకు శుభం జరిగే అవకాశం ఉందట..