Donate: ఆదివారం రోజు ఈ వస్తువులు దానం చేస్తే ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా?

మామూలుగా మన జీవితంపై సూర్య భగవానుడి ప్రభావం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక సూర్యుడు నవగ్రహాలలో మొదటివాడు. అందుకే ఆయన పూజిస్తే ఇతర గ్రహాలను కూడా పూజించినట్టే అని చెబుతూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - September 12, 2022 / 08:30 AM IST

మామూలుగా మన జీవితంపై సూర్య భగవానుడి ప్రభావం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక సూర్యుడు నవగ్రహాలలో మొదటివాడు. అందుకే ఆయన పూజిస్తే ఇతర గ్రహాలను కూడా పూజించినట్టే అని చెబుతూ ఉంటారు. అందుకే చాలామంది ప్రతిరోజూ ఉదయం లేవగానే సూర్యకిరణాలకు నమస్కారం చేస్తూ ఉంటారు. అయితే సూర్యకిరణాలు మన శరీరంపై పడకపోతే ఖచ్చితంగా అనారోగ్య బారిన పడతాం అని జ్యోతిష్య శాస్త్రంలోనూ అదే విధంగా వైద్యశాస్త్రం నిరూపించబడింది.

అందువల్లే మానవ జీవితంలో మొదటగా నమస్కరించవలసిన భగవంతుడు సూర్య భగవానుడే. ఆ సూర్యభగవానుడి నికి ప్రీతికరమైన రోజు ఆదివారం. ఆదివారం రోజు సూర్యభగవానుడి ఆరాధనకు అంకితం చేయబడింది. అయితే ఆ సూర్య భగవానుడి కృప కావాలి అన్న సూర్య భగవానున్ని ప్రసాదం చేసుకోవాలి అంటే.. రాగి కలశంలో అర్ఘ్యం క్రమం తప్పకుండా సమర్పించడం మంచిది. సూర్య భగవానునికి నిత్యం అర్ఘ్యం సమర్పించే వ్యక్తి జాతకంలో సూర్యుడు బలంగా ఉంటాడు.

తత్ఫలితంగా, అతనికి కీర్తి, పురోగతి, గౌరవం, ప్రతిష్ట, ఆరోగ్యం వంటివి కూడా లభిస్తాయి. అయితే సూర్యభగవానుడుని ప్రసన్నం చేసుకోవాలంటే, సూర్యుడు దయ మన పై ఉండాలి అన్న ఆదివారం నాడు దానం చేయడం చాలా మంచిదని సూచించబడింది. ఆదివారం ఆదిదేవుడైన సూర్యుడి వారం కావటంతో ఆయనకు ఇష్టమైనవి చేస్తే తప్పక ఫలితం ఉంటుంది. ఆదివారం నాడు సూర్యభగవానుడికి ఇష్టమైన రాగి, గోధుమలు, పప్పులు, బెల్లం మరియు ఎర్ర చందనం మొదలైనవి దానం చేయాలి.