Site icon HashtagU Telugu

Financial Problems: ఆర్థిక సమస్యలు తీరిపోవాలంటే దీపావళి రోజు ఇలా చేయాల్సిందే!

Financial Problems

Financial Problems

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఆర్థిక సమస్యలు కారణంగా సతమతమవ్వడంతో పాటు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొందరు ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బులు మిగలడం లేదని బాధపడుతూ ఉంటారు. ఇకపోతే త్వరలోనే దీపావళి పండుగ రాబోతోంది. ఈరోజున కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే తప్పకుండా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు. మరీ దీపావళి రోజు ఎలాంటి పరిహారాలు పాటించాలి అన్న విషయానికి వస్తే.. అంతేకాకుండా దీపావళికి సంబంధించిన కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి.

ఇవి ఇంటికి ఆనందం, శ్రేయస్సును కలిగిస్తాయి.అదే సమయంలో, ఈ తప్పులు చేయడం ద్వారా మా లక్ష్మి కోపంగా ఉంటుంది కాబట్టి ఈ రోజున కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి. ప్రజలు దీపావళి రోజున ఉదయాన్నే ఇంటిని శుభ్రపరచడం ప్రారంభిస్తారు. అయితే ఈ పనిని ధన్తేరస్ ముందు చేయాలట. దీపావళి రోజు మైనర్ క్లీనింగ్ వేరే విషయం కానీ మరీ ఎక్కువ క్లీనింగ్ వర్క్ చేయకూడదు. దీపావళి రోజు సాయంత్రం తర్వాత స్వీప్ చేయడం మానుకోవాలి. సాయంత్రం ఊడిస్తే, లక్ష్మీదేవి ఇంట అడుగుపెట్టదట. దీపావళి రోజు రాత్రంతా ఇంటి తలుపు తెరిచి ఉంచాలట. దీపావళి రోజు రాత్రి లక్ష్మీదేవి ప్రతి ఇంటిని సందర్శిస్తుందని నమ్ముతారు.

దీపావళి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెప్పులు, బూట్లు, డస్ట్‌బిన్ వంటి వాటిని ఉంచవద్దని చెబుతున్నారు. ఇకపోతే చేయాల్సిన పనుల విషయానికి వస్తే.. దీపావళి రోజున ఇంటి గుమ్మం దగ్గర ఊడ్చడం శుభప్రదం. ముందుగా ఇంటిని శుభ్రం చేయండి కానీ అదే రోజు తలుపు తుడుచుకోవాలి. దీపావళి రోజున తలుపు తుడుచుకోవడం ద్వారా ఇంట్లోని ప్రతికూలతలు, దోషాలు తొలగిపోతాయట. అలాగే దీపావళి నాడు దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో డబ్బుకు సంబంధించిన ఏదైనా వస్తువును విరాళంగా ఇవ్వాలట. ఇలా చేయడం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహం నిలిచి ఇంటి ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. అలాగే సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయట. దీపావళి రోజున ఎక్కడైనా దీపం వెలిగించండి కానీ ఖచ్చితంగా బావి లేదా వాటర్ ట్యాంక్ దగ్గర దీపం వెలిగించడం ఉత్తమం అని చెబుతున్నారు..

Exit mobile version