Site icon HashtagU Telugu

Flowers: చీకటి పడిన తర్వాత పూలు ఎందుకు కోయకూడదో తెలుసా?

Flowers

Flowers

హిందువులు ఎప్పటినుంచో కొన్ని రకాల విషయాలను ఇప్పటికీ అలాగే అనుసరిస్తూ ఉన్నారు. కొందరు వాటిని మూఢనమ్మకాలు చాదస్తాలు అని కొట్టి పారేస్తే ఇంకొందరు మాత్రం వాటి కారణాలు తెలియకుండానే వాటిని ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకు ఫాలో అవుతున్నారు వాటి వెనుక ఉన్న రీజన్ ఏంటి అన్నది చాలా మందికి తెలియదు. దాంతో చాలా విషయాలు మూఢనమ్మకాల జాబితాలో చేరిపోయాయి. అటువంటి వాటిలో చీకటి పడిన తర్వాత పూలు కోయకూడదు అన్న మాట కూడా ఒకటి.

అయితే చీకటి పడిన తర్వాత పూలు కోయకూడదని ఎందుకు అంటారో? ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హిందూ సంప్రదాయంలో పూలకి ప్రత్యేక స్థానం ఉంది. శుభం,అశుభం, పండుగ ఫంక్షన్ ఇలా సందర్భం ఏదైన ఘమఘమలాడే పూల వాసన ఉండాల్సిందే. అయితే సందర్భాల మాట పక్కనపెడితే సూర్య స్తమయం అయిన తర్వాత పూలు కోయకూడదని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే సాయంత్రం చీకటి పడే సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది.

ఆ సమయంలో పురుగులు, పాములు చెట్లపై చేరే అవకాశం ఉంది వెలుగు ఉండదు కాబట్టి చెట్టుపై ఉండే పురుగులు కనిపించే అవకాశం ఉండదు. ఆ సమయంలో పూలు కోస్తే విషపురుగుల బారిన పడతామని ఉద్దేశం. ఇదే కాకుండా మరోకారణం ఏంటంటే.. చీకటి పడగానే మొక్కలు, చెట్లు కిరణజన్య సంయోగ క్రియను ఆపేస్తాయి. అలాంటప్పుడు వాటి నుంచి ఆక్సిజన్ కాకుండా కార్బన్ డై ఆక్సైజ్ విడుదలవుతుంది. ఆ గాలి పీల్చడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి చీకటిపడ్డాక పూలు కోయద్దని చెబుతారు. కేవలం ఈ విషయంలో అని మాత్రమే కాకుండా చాలా విషయాలను పెద్దలు చెప్పే వాటి వెనుక సైన్స్ తో పాటు ఆధ్యాత్మికత కూడా దాగి ఉంది.

Exit mobile version