Tuesday: పొరపాటున కూడా మంగళవారం రోజు చేయకూడని పనులు ఇవే?

వాస్తు శాస్త్ర ప్రకారం వారంలో కొన్ని రోజులలో కొన్ని రకాల పనులు చేయకూడదు కొన్ని రకాల పనులు చేయవచ్చని చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో మంగళవారం

  • Written By:
  • Publish Date - August 2, 2023 / 08:30 PM IST

వాస్తు శాస్త్ర ప్రకారం వారంలో కొన్ని రోజులలో కొన్ని రకాల పనులు చేయకూడదు కొన్ని రకాల పనులు చేయవచ్చని చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో మంగళవారం కూడా ఒకటి. మంగళవారం రోజున తెలిసి తెలియక కూడా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు. హిందూమతంలో హనుమంతుడికి మంగళవారం అంకితం చేశారు. హనుమంతుడిని భక్తులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. హనుమంతుని అనుగ్రహాన్ని పొందుతాడు. మంగళవారం మీరు హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజించవచ్చు. ఎప్పుడు కూడా మంగళవారం రోజు కొత్త ఇల్లు కొనకూడదు. కొత్త ఇల్లు కొని భూమి పూజ చేస్తే ధన నష్టం కలుగుతుంది. కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతారు.

అలాగే మంగళవారం మీరు నల్ల బట్టలు కొనుగోలు చేయకూడదు. అలాగే మంగళవారం నాడు నల్లని దుస్తులు ధరించవద్దు. మంగళవారం మీరు ఎరుపు, నారింజ రంగు దుస్తులు ధరించాలి. మీ జాతకంలో కుజదోషం ఉంటే ఆ దోషం తగ్గుతుంది. అలాగే మంగళవారం నాడు ఎలాంటి ఇనుప పదార్థాలను కొనుగోలు చేయకూడదు. ఇనుప పదార్థం ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. అదేవిధంగా ఈ రోజున గాజుసామాను కొనకపోవడమే మంచిది. ఆర్థిక సమస్యలు చుట్టు ముడతాయి. దీంతో ఇంట్లో అశాంతి, గొడవలు చోటుచేసుకుంటాయి. మంగళవారం నాడు ఎలాంటి గాజు వస్తువును బహుమతిగా స్వీకరించకూడదు. అలా చేయడం వల్ల ధన నష్టం కలుగుతుంది. మంగళవారం నాడు మహిళలు ఎలాంటి కొత్త వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు.

వివాహిత స్త్రీలు కూడా సౌందర్య సాధనాలను కొనకూడదు. మంగళవారం నాడు హనుమంతుడికి కుంకుమ సమర్పిస్తారు. కాబట్టి ఆ రోజు కుంకుమ కొనకూడదని అంటారు. ఇది వైవాహిక జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, గొడవలు ఉంటాయి.అలాగే ఈ రోజు పాలతో చేసిన స్వీట్ ఏదీ కొనుగోలు చేయకూడదు. ఇది సంపద నష్టం, ఇంట్లో సమస్యలు దారితీస్తుంది. పాలు చంద్రుని మూలకం. అంగారకుడు, చంద్రుడు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి. మంగళవారం నాడు హనుమంతుడికి తీపి పాలను సమర్పించకూడదు. ఎవరికీ పాలు మిఠాయిలు కూడా దానం చేయవద్దు.