Amavasya: అమావాస్య రోజు ఈ పనులు చేశారంటే అంతే సంగతులు?

సాధారణంగా అమావాస్య సమయంలో చాలామంది తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. అలా తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల తీవ్రమైన ఇబ్బందులను

  • Written By:
  • Publish Date - May 25, 2023 / 07:50 PM IST

సాధారణంగా అమావాస్య సమయంలో చాలామంది తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. అలా తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మరి అమావాస్య సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఆ తర్వాత కూడా నిద్రపోతే జ్యేష్టా దేవి మీ ఇంట్లో తిష్టవేసుకుంటుంది. అలాగే అమావాస్య రోజు తల స్నానం చేయకపోవడం కూడా దరిద్రమే.

అందుకే ఆ రోజు తప్పకుండా తలస్నానం చేయాలి. ఆ రోజున తలంటుకోరాదు. అదేవిధంగా అమావాస్య రోజు కొత్త దుస్తులు ధరించకూడదు. అమావాస్య నాడు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. అమావాస్య రోజు రాత్రి భోజనం అస్సలు చేయకూడదు. మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారం తీసుకోవడం ఉత్తమం. అలాగే అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదిలితే ఇంట్లో శుభఫలితాలు ఉంటాయి. పితృదేవతలకు ప్రీతికరంగా నువ్వులు, గుమ్మడికాయ దానంగా ఇవ్వవచ్చు.

అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించడం లాంటివి చేయరాదు. ఇలా చేస్తే దరిద్ర దేవత నుంచి అస్సలు తప్పించుకోలేరు. అమావాస్య రోజు తలకు నూనె అస్సలు పెట్టుకోకూడదు. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం, పితృదేవతలను తలుచుకుని నమస్కరిస్తే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది. అలాగే అమావాస్య రోజున కొత్త పనులు, శుభకార్యాలను చేయరాదు. కొనసాగుతున్న పనులు నిలిపివేయాల్సిన పనిలేదు. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. ఈ రోజున అన్నదానం, వస్త్రదానం విశేషం, లక్ష్మీదేవి పూజకు అత్యంత అనుకూలం. అమావాస్య పూజ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఇంకా జీవితంలో సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది. పితృదేవతలు మన శ్రేయస్సును కోరుకుంటారు కాబట్టి అమావాస్య రోజున వారికి పిండ ప్రదానం చేయాలి. లేకుంటే కనీసం నీరైన వదలాలి.