మామూలుగా వాస్తు శాస్త్ర ప్రకారం సూర్యోదయం సమయంలో అలాగే సూర్యాస్తమయం సమయంలో తెలిసి తెలియకుండా కొన్ని రకాల తప్పులు పొరపాట్లు చేయకూడదని పండితులు చెబుతూ ఉంటారు. వాటి వల్ల అనేక రకాల కష్టాలను సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది సూర్యాస్తమయం సమయంలో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మరి సూర్యాస్తమయం సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు అన్న విషయానికి వస్తే..
సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ డబ్బులు అప్పు ఇవ్వకూడదట. అలాగే ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోకూడదట. సాయంత్రం పూట ఆర్థిక లావాదేవీలు చేయకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. అలాగే సూర్యాస్తమయం తరువాత చీపురుతో ఇల్లు ఊడ్చకూడదట. అలా చేయటం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందట. ఇది వ్యక్తి ఆర్థిక పరిస్థితి పై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. అలాగే ఎట్టి పరిస్థితులలోని సూర్యాస్తమయం తరువాత తులసి మొక్కకు నీరు పోయకూడదట. ఎందుకంటే తులసి మొక్క లక్ష్మీదేవి నివాస స్థానం కాబట్టి నీరు పోయడం వల్ల తులసి దేవి ఆగ్రహానికి లోనవ్వక తప్పదు.
అలాగే ఆ సమయంలో తులసి కోటని శుభ్రం చేయటం, ఆకులని తుంచటం వంటి పనులు చేయకూడదట. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. సాయంత్రం పూట తులసిని తాకకుండా దీపం పెట్టుకోవాలి. అలాగే సాయంత్రం తరువాత ఇంటి ప్రధాన ద్వారం మూసి ఉంచకూడదట. లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయం ఇదేనని, ఈ సమయంలో మెయిన్ డోర్ మూసి ఉంచటం వల్ల లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్ళిపోతుందని చెబుతున్నారు.
అలాగే సాయంత్రం దాటిన తర్వాత స్త్రీలని తిట్టడం, వారితో చులకనగా మాట్లాడటం, వారితో గొడవకు దిగడం వంటివి చేయకూడదని పండితులు చెబుతున్నారు. సూర్యాస్తమయం సమయంలో ఎవరైనా పేదవాడు కానీ బిక్షగాడు గాని ఇంటికి వస్తే వారిని ఒట్టి చేతులతో పంపించకూడదట. అలాగే సాయంత్రం తర్వాత పడుకోవడం నిషిద్ధం. ఆ సమయంలో నిద్ర పోవడం వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. అలాగే సంధ్యా సమయంలో గుమ్మం మీద ఇంటి ఆడపిల్లలు కూర్చోకూడదట. దీని వలన లక్ష్మీదేవికి అసంతృప్తి కలుగుతుందట.