Site icon HashtagU Telugu

Ganesh Chaturthi 2024: అదృష్టం కలిసి రావాలంటే వినాయక చవితిని ఆ సమయంలో చేసుకోవాల్సిందే!

Ganesh Chaturthi

Ganesh Chaturthi

దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వినాయక చవితి పండుగ వచ్చేసింది. రేపు అనగా సెప్టెంబర్ 7 2024 శనివారం రోజున వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాటు కూడా దాదాపుగా పూర్తి అయిపోయాయి. కేవలం గణనాథులను మండపాలకు తీసుకురావడం ఒకటే ఆలస్యం. ఇది వినాయక చవితి రోజు వీధుల్లో ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద భారీ గణనాథులకు పూజలు చేయడంతో పాటు కొందరు చిన్న విగ్రహాలను ఇంటికి తెచ్చుకొని మరి పూజిస్తూ ఉంటారు.

అయితే మరి రేపు జరుపుకోబోయే ఈ వినాయక చవితి పండుగను ఏ సమయంలో చేసుకుంటే మంచిది. అదృష్టం కలిసి రావాలంటే ఏ సమయంలో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చిన్న పెద్దా, కులం, మతం అని తేడా లేకుండా అందరూ ఎంతో భక్తి శ్రద్దలతో గణపయ్యను కొలుస్తారు. అంగ రంగ వైభవంగా జరిగే వినాయకుడి ఉత్సవాలను జరిపిస్తారు. అయితే వినాయక వ్రతము ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి లేదు. మంచి శుభ ముహూర్తంలోనే చేస్తే ఆ గణనాథుని ఆశీస్సులు మనకు లభిస్తాయి. అయితే రేపు అనగా శనివారం ఉదయం 11:03 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట సమయం వరకు వినాయక చవితి పూజ చేసుకోవచ్చు.

అలాగే సాయంత్రం 6:22 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల మధ్యలో పూజ చేసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఇక ఈ రోజు నా పూజ చేసేవారు ఎరుపు రంగు దుస్తులు లేదా నీలం రంగు దుస్తులు ధరించి పూజలు చేస్తే మరింత అదృష్టం కలిసి వస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ఇక వినాయక చవితి రోజు కొబ్బరి నూనె వేసి జిల్లేడు వత్తులతో దీపం పెట్టడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. అలాగే వినాయకుడికి గరికత తయారుచేసిన మాల వేస్తే ఇంకా మంచిదట. ఇలా చేస్తే ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కవచ్చని చెబుతున్నారు.