Site icon HashtagU Telugu

Financial Problems: అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలంటే ఈ పరిహారాలు చేయాల్సిందే?

Practical Solution To Your Money Problems Feature1

Practical Solution To Your Money Problems Feature1

మీరు కూడా అప్పుల బాధతో సతమతమవుతున్నారా! మరి అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయట. అలాగే మంగళవారం రోజు మాత్రమే ఈ రుణవిమోచన అంగారక స్త్రోత్రాన్ని పారాయణం చేయాలని పండితులు చెబుతున్నారు. అయితే ఇందుకోసం సూర్యోదయాని కంటే ముందు నిద్రలేచి ఈ స్త్రోత్రాన్ని పారాయణం చేయాలి. స్నానం చేసే నీటిలో ఎర్రని కుంకుమను, ఎర్రను కందులు కలుపుకొని ఈ నీళ్లతో స్నానం చేసి ఎర్రని వస్త్రాలు ధరించాలి. నుదుటన ఎర్రని కుంకుమను కూడా ధరించాలి. తర్వాత దక్షిణం వైపు తిరిగి అంగారక స్తోత్రం పారాయణం చేయాలి. ఎర్రని గిన్నెలో కందులు వేసుకొని దానిపై ఎర్రటి పుష్పాన్ని పెట్టి ఈ స్తోత్రం పారాయణం చేయడం మంచిది. ఆ స్తోత్రం ఏంటి అన్న విషయానికొస్తే… శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే ఏకదంత ముపాస్మహే అనే మంత్రాన్ని పఠించాలి. అని మంత్రాన్ని పఠించి గణపతికి నమస్కారం చేసుకోవాలి. తరువాత దీపాన్ని వెలుగించుకొని, అగరబత్తులు వెలిగించుకొని పూజ చేయాలి. బెల్లం పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి. నైవేద్యం పెట్టిన తరువాత ఈ అంగారక స్తోత్రాన్ని పారాయణం చేయాలి.

స్కంద ఉవాచ రుణగ్రస్త నరాణాంతు రుణముక్తిః కథం భవేత్ | బ్రహ్మొవాచ వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదం | అస్య శ్రీ అంగారక స్తోత్ర మహామంత్రస్య గౌతమ రుషిః అను ష్టుప్ ఛందః అంగారకో దేవతా మమ రుణ విమోచనార్థే జపే వినియోగః | ధ్యానమ్ రక్తమాల్యాంబరధరః శూలశక్తి గదాధరః | చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః || మంగళో భూమిపుత్రశ్చ రుణహర్తా ధనప్రదః | స్థిరాసనో మహాకాయో సర్వకామఫలప్రధః || లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకరః | ధరాత్మజః కుజో భౌమో భూమిజో భూమినందనః || అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకః | సృష్టేః కర్తా చ హర్తా చ సర్వదేవైశ్చపూజితః || ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పరేత్ | రుణం న జాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయం|| అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సలః | నమోస్తుతే మమాశేష రుణమాశు వినాశయ || రక్తగంధైశ్చ పుష్పైశ్చ ధూపధీపైర్గుడోదకైః | మంగళం పూజయిత్వా టు మంగళాహనీ సర్వదా || ఏకవింశతి నామాని పఠిత్వాతు తదండకె | రుణరేఖాః ప్రకర్తవ్యాః అంగారేణ తదగ్రతః || తాశ్చ ప్రమార్జాయేత్పశ్చత్ వామపాదేన సంస్పృశత్ | మూలమంత్రః | అంగారక మహీపుత్ర భగవాన్ భక్తవత్సల | నమోస్తుతే మహాశేషరుణమాశు విమోచయ || ఏవం కృతే న సందేహూ రుణం హిత్వా ధనీ భవేత్ || మహతీం శ్రియమాప్నోటి హ్యపరో ధనదో యథా | అర్ఘ్యం అంగారక మహీపుత్ర భగవన్ భక్త వత్సల | నమోస్తుతే మమాశేరుణమాశు విమోచయ || భూమిపుత్ర మహాతేజః స్వేదోద్భవ పినాకినః | రుణార్తస్త్వాం ప్రపన్నోస్మి గ్రహాణార్ఘ్యం నమోస్తుతే || పైన వున్న ఈ స్తోత్రాన్ని మొత్తం 21 సార్లు పారాయణం చేయాలి. 21 పూలను తీసుకొని ఒక్కో పువ్వును సమర్పిస్తూ అంగారకుడికి సమర్పించాలి. పువ్వులను సమర్పిస్తున్నప్పుడు 21 అంగారక నామాలను పఠించాలి.

ఓం మంగళాయ నమ:
ఓం భూమి పుత్రాయ నమ:
ఓం రుణ హస్త్రే నమ:
ఓం ధన ప్రదాయ నమ:
ఓం స్థిరాసనాయ నమ:
ఓం మహాకాయాయ నమ:
ఓం సర్వకామ ఫల ప్రదాయ నమ:
ఓం లోహితాయ నమ:
ఓం లోహితాక్షాయ నమ:
ఓం సామగాన కృపాకరాయ నమ:
ఓం ధరాత్మజాయ నమ:
ఓం కుజాయ నమ:
ఓం భౌమాయ నమ:
ఓం భూమిజాయా నమ:
ఓం భూమినందనాయ నమ:
ఓం అంగారకాయ నమ:
ఓం అంగారకాయ నమ:
ఓం యమాయ నమ:
ఓం సర్వరోగాయపహారకాయ నమ:
ఓం స్రష్టే నమ:
ఓం కర్తృే నమ:
ఓం హర్త్రే నమ:
ఓం సర్వదేవ పూజితాయ నమ:

ఈ 21 నామాలను చదివి పూలను సమర్పన చేసుకోవాలి. తరువాత బెల్లం పానకాన్ని ప్రసాదంగా తీసుకుంటే పరిహారం పూర్తయినట్టే. అయితే 21 రోజుల్లో మీరు ఎదుర్కొంటున్న సమస్య నుంచి బయటపడతారు అంటున్నారు పండితులు.

Exit mobile version