Site icon HashtagU Telugu

Dog: కుక్క ఏడవడం మంచిది కాదా.. ఏడిస్తే మనుషులు చనిపోతారా.. పండితులు ఏం చెబుతున్నారంటే?

Mixcollage 12 Dec 2023 04 49 Pm 4801

Mixcollage 12 Dec 2023 04 49 Pm 4801

మామూలుగా మనుషులు ఎక్కువగా పెంచుకునే జంతువులలో కుక్క కూడా ఒకటి. ఎక్కువ శాతం మంది కుక్కని ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. జంతువులలో అత్యంత విశ్వాసం కలిగినది కుక్క అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే కొన్ని కొన్ని సార్లు పగలు సమయంలో రాత్రి సమయంలో కుక్కలు ఏడవడం అన్నది చూసే ఉంటాం. అలా ఏడ్చినప్పుడు చాలామంది తెగ భయపడిపోతూ ఉంటారు. కుక్క అలా ఏడవడం మంచిది కాదని, ఎవరైనా మనుషులు చనిపోయే ముందుగా లేదంటే చనిపోయినప్పుడు మాత్రమే కుక్కలు ఆ విధంగా ఏడుస్తాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి నిజంగానే కుక్కలు ఏడవడం మంచిది కాదా ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇలా కుక్క అరవడాన్ని అపశకునంగా భావించే వాటిని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కొట్టి పరేస్తున్నారు.వాస్తవానికి ఈ నమ్మకం మన దేశంలో పుట్టినది కాదు. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయన్న నమ్మకం గ్రీకుల నుంచి వచ్చింది. కుక్కలు దుష్టశక్తుల్ని కనిపెట్టగలవని, దెయ్యాలను చూడగలవని గ్రీకులు బలంగా నమ్మేవారట. కుక్క ఏడిస్తే చెడు జరుగుతుందని, మరణం సంభవించే అవకాశాలున్నాయని అనుకోవడం కూడా వారినుంచే మొదలైంది. అలా ఆ విషయం ఇతర దేశాలకు కూడా పాకింది. ఏడు గిట్టలున్న కుక్కకు దెయ్యాలు కనబడతాయని ఒక పుస్తకంలో రాశాడు ఒక అమెరికా రచయిత. కుక్క శూన్యంలోకి చూసి అరుస్తున్నా, ఏడుస్తున్నా కచ్చితంగా దెయ్యాన్ని చూశాకే అలా చేస్తుందని నమ్ముతారు.

ఇవన్నీ మూఢనమ్మకాలని కొందరు కొట్టిపడేసినా చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. కుక్కలు దెయ్యాన్ని చూడగలగడం, మరణాన్ని పసిగట్టడం అన్ని మూఢవిశ్వాసాలు అని హేతువాదులు కొట్టిపారేస్తున్నారు. ఇలాంటి వాటిని విశ్వసించ వలసిన అవసరం లేదని చెబుతున్నారు. కానీ అందుకు వివరణ ఇస్తున్నారు పండితులు. కుక్కలు మనిషిని వాసన ఆధారంగా పసిగడతాయి. అలాగే ఒక వ్యక్తి చావుకి దగ్గరైనప్పుడు ఆ చుట్టుపక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్పులను ముందుగా గుర్తించేస్తాయట. వాసన ద్వారా మరణాన్ని పసిగట్టగానే అలా ఏడుస్తాయంటారు. కొన్నిసార్లు అనారోగ్యం, ఆకలి కారణంగా ఏడుస్తాయని చెప్పేవారున్నారు. కానీ కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండానే ఏడుస్తాయి. అంటే వాటికి ఆత్మలు కనిపించాయని అర్థం అంటారు పండితులు. కుక్క అరిస్తే మరణం సంభవిస్తుంది అన్నది అపోహ మాత్రమే అని కొట్టిపడేయానికి కారణం ఏంటంటే సైంటిఫిక్ గా నిరూపణ కాలేదు.