Site icon HashtagU Telugu

Astrology: కుక్కలు ఏడ్చినా, మూలిగినా ప్రమాదం సంభవిస్తున్నట్టా.. పండితులు ఏం చెబుతున్నారంటే?

Astrology

Astrology

మనుషులు ఎక్కువగా పెంచుకునే జంతువులలో కుక్క కూడా ఒకటి. దాదాపుగా చాలా వరకు ప్రతి ఇళ్లల్లో కుక్కలు పెంచుకుంటూ ఉంటారు. ఇల్లలో పెంచుకోవడానికి ఇష్టపడని వారు వీధి కుక్కలను కూడా పెంచుతూ ఉంటారు. కుక్కలకు ఒక్కసారి పిటికెడు అన్నం పెడితే ఆ విశ్వాసం ఎప్పటికీ పోదని అంటుంటారు. అయితే ఈ కుక్కలు కొన్ని కొన్ని సార్లు గట్టిగ అరవడం, రాత్రిళ్ళు ఏడవడం, మూలగడం లాంటివి చేస్తూ ఉంటాయి. ఇలాంటివి చేసినప్పుడు వాటికి ఏదో కనిపించిందని ఏదో కీడు జరగబోతుందని అంటుంటారు. మరి నిజంగానే కుక్కలు ఏడ్చినా లేదంటే మూలిగినా ఏదైనా ప్రభావం సంభవిస్తున్నట్టా? ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కుక్కలు ఇంటి పరిసర ప్రాంతాలలో మూలిగినా లేదంటే ఏడ్చిన యమ ధర్మరాజు వస్తున్నట్లు భావిస్తారు. కుక్కలు వాసన చూసి ఎలా అయితే చోరులని గుర్తిస్తాయో అలాగే మానవులకు కనిపించని అనేక దివ్య, దుష్ట శక్తులు కుక్కలకు కనిపిస్తాయట. కుక్కలు అలా ప్రవర్తించినప్పుడు చాలా సార్లు చాలా చోట్ల మరణాలు కూడా సంభవించాయట. ప్రకృతిని భగవంతుడి ఉనికిని తెలుసుకోవడానికి ఎన్ని జన్మలైనా చాలవు. కానీ పశుపక్షాదుల్లో కొన్ని అతీత శక్తులు ఉంటాయట. మానవుడు గుర్తించలేని వాటిని అవి ఎన్నో గుర్తిస్తాయని చెబుతున్నారు. చెప్పడానికి కుక్కలకు మాట లేదు. ఒకవేళ ఆ కుక్కలకు గనుక మాటలు వచ్చి ఉంటే భూమి మీద మానవుడు ఉండేవాడు కాదని చెబుతున్నారు. కుక్కలకే కాదు భూమిపై నివసించే ఏ జీవికి మాట్లాడే శక్తి ఉన్న మనిషి ఈ భూమిని శాసించలేడు. అందుకే భగవంతుడు అన్నీ ఉన్న జంతువుల కంటే తక్కువ అర్హతలతో మనిషిని పుట్టించి ఈ మాట అనేది ఇచ్చి అందరికంటే ఎక్కువ చేశాడని పండితులు చెబుతున్నారు.

మీ ఇంటి బయట లేదా తలుపు వద్ద కుక్క మొరిగితే. ఇది ఏదో ఒక వ్యాధిని సూచిస్తుందని అర్థం. మీ కుటుంబంలో ఎవరైనా పెద్ద అనారోగ్యంతో బాధపడవచ్చని అర్థం అంటున్నారు. కుక్క రాత్రి ఏడుస్తుంటే, అది కొన్ని పెద్ద దురదృష్టాలను సూచిస్తుందట. అందుకే కుక్కను ఇంటి బయట ఏడవనివ్వకూడదు. కుక్కల ఏడుపు ఆర్థిక నష్టాన్ని సూచిస్తుందట. భవిష్యత్తులో కొన్ని పనుల వల్ల నష్టపోయే అవకాశం ఉందని, దీని వల్ల మీరు నష్టపోవాల్సి రావచ్చని చెబుతున్నారు. ఏదైనా ఇంటి బయట కుక్క ఏడుస్తుంటే కొన్ని చెడ్డ వార్తలు వినే అవకాశాలు ఉంటాయట. మీ ఇంట్లో చుట్టూ ప్రతికూల శక్తులు ఉన్నట్టయితే కుక్కలు దానిని పసిగట్టి మొరగడం ప్రారంభిస్తాయట.