Work: ఏ పని చేసిన కలిసి రావడం లేదా.. అయితే ఇలా చేయాల్సిందే?

  • Written By:
  • Updated On - March 11, 2024 / 04:35 PM IST

కొందరు ఎటువంటి పని మొదలు పెట్టినా కూడా అనేక సమస్యలు మొదలవుతూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. దాంతో చాలామంది దిగులు చెందుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలో తెలియక దిగులు చెందుతూ ఉంటారు. మీరు కూడా అలాంటి ప్రాబ్లెమ్స్ తో సఫర్ అవుతున్నారా. అయితే అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆయుర్వేదంలో తులసికి ఉండే ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. అనేక వ్యాధులను నయం చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. తులసి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలవడంతోపాటు ఆ ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది.

మాములుగా పండగలు, శుభకార్యాలకు బంతిపువ్వులను ఉపయోగిస్తూ ఉంటారు. పండగలొచ్చినప్పుడు వాటి తోరణాలతో ఇంటిని అలంకరిస్తాం. బంతి చెట్టు నాటడంవల్ల ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. బంతి చెట్టు నాటడానికి ఉత్తమ దిశ ఈశాన్యం. కలబంద ప్రస్తుతం అందరూ ఇళ్లల్లో పెంచుతున్నారు. దీనిలో అనేక ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. చర్మం, జుట్టుకు ఇది ఒక వరం లాంటిది. మనిషిలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి పనిచేస్తుంది. కలబంద నాటడానికి ఉత్తమ దిశ ఉత్తర దిశగా చెప్పవచ్చు. నాగిని తీగ.. ఈ నాగిని ఆకులను విద్య ఆకులు అని అంటారు.

ఆహారం కోసం వీటిని ఉపయోగిస్తారు. హిందూ సంస్కృతిలో వీటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నాగిని ఆకులను శుభ సందర్భంలో ఏదైనా పూజకు ఉపయోగిస్తారు. నాగిని తీగను ఇంట్లో నాటడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనుబంధాలు పెరుగుతాయి. నాగిని తీగను నాటడానికి ఉత్తమ దిశ పశ్చిమ ఉత్తరం. దిశలు..వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ఇంట్లో నుంచి ప్రతికూలశక్తిని తొలగిస్తుంది. మట్టిలో లేదంటే నీటిలో కూడా నాటవచ్చు. నీటిలో నాటడం శుభం కింద చూస్తారు. ప్లాంట్ ఆకులు దెబ్బతింటే వెంటనే వాటిని తొలగించాలి.

మనీప్లాంట్ తీగ పైకి కదలడం చాలా శుభసూచకమని, కిందకి కలగడం అశుభ సూచకంగా పరిగణిస్తారు. మనీ ప్లాంట్ నాటడానికి సరైన దిశ ఆగ్నేయ కోణం. ఫెంగ్ షుయ్‌లో వెదురు మొక్కను సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వెదురు మొక్క శ్రేయస్సు యొక్క చిహ్నంగా భావిస్తారు. ఇది వేగంగా పైకి పెరుగుతుంది. దీనివల్ల కుటుంబంలో కీర్తి, సానుకూల శక్తి, శ్రేయస్సు, అదృష్టం ఆకర్షిస్తుంది. కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండటానికి, ఆర్థికంగా బలోపేతం అవడానికి ఫెంగ్ షుయ్ ముఖ్యమైంది. అదృష్ట చెట్టు అని కూడా పిలుస్తుంటారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచవచ్చు. మందపాటి మొక్కలు నాటడానికి సరైన దిశ ఆగ్నేయం..