Vastu Tips: డబ్బు విపరీతంగా ఖర్చవుతుందా? ఇంట్లో ఈ వాస్తుదోషాలు సరిచేసుకోండి. లక్ష్మీదేవి నట్టింట్లో తిష్టవేస్తుంది.

  • Written By:
  • Publish Date - April 11, 2023 / 01:34 PM IST

మన జీవితంలో వాస్తుశాస్త్రం (Vastu Tips)ఒక భాగమైంది. నేటికాలంలో వాస్తుశాస్త్రం ప్రకారమే ప్రతి పనిని మొదలుపెడుతున్నారు. ఇంటికి స్థలం నుంచి మొదలు చెప్పులు పెట్టుకునే స్థలం వరకు ప్రతిదీ వాస్తు ప్రకారమే ఉండాలనుకుంటున్నారు. అందుకే వాస్తుశాస్త్రంలో ఇంట్లోని ప్రతి భాగానికి ప్రాముఖ్యత ఇచ్చారు. ఇంట్లోని ప్రతిప్రదేశానికి ఏదొక గ్రహానికి సంబంధించి ఉంటుందని చెబుతుంటారు పండితులు. ఇంట్లోని అన్ని ప్రదేశాల్లో వాస్తు నియమాలు పాటిస్తే జాతకంలో గ్రహాల స్థితి మెరుగుపడుతుంది. అయితే ఈ పరిహారం కోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంటికి వాస్తు అనేది సరిగ్గా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. అయితే కొంతమంది ఇంట్లో విపరీతంగా డబ్బు ఖర్చవుతుంది. ఎంత సంపాదించినా చిల్లిగవ్వ మిగలదు. అలాంటి వారు రూపాయి ఖర్చు లేకుండా ఈ పూజలు చేసినట్లయితే మీ లక్ష్మీదేవి తిష్టవేస్తుంది.

ప్రధానద్వారం:
ఇంటి ప్రధాన ద్వారం మీ ఇంట్లో సంతోషానికి కారణం అవుతుంది. ప్రధాన ద్వారంలో వాస్తు సమస్యలు ఉంటే ఇంట్లో ఆర్థిక, అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అందుకే ఇంటికి ప్రధాన ద్వారా ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రధాన ద్వారం వద్ద వెలుతురు ఉండేలా చూడాలి. ఇంటికి కొంతమంది నేమ్ ప్లేట్ పెడుతుంటారు. నేమ్ ప్లేట్ ఎప్పుడూ కూడా నలుపు రంగులో ఉండకూడదు. ముఖ్యంగా శనివారం ఇంటికి ప్రధానగుమ్మం వద్ద దీపం వెలిగించడం శ్రేయస్కరం.

మెట్లు :
మెట్లు ఇంటి పురోగతికి సంబంధించినవి. రాహు-కేతువులను ఇంటి మెట్ల నుండి నియంత్రించవచ్చు. మెట్లు ఇంటికి సరైన దిశలో లేనట్లయితే జీవితంలో ఆకస్మిక సమస్యలను సృష్టిస్తాయి. నైరుతి కోణంలో మెట్లు ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. మెట్లు ఎల్లప్పుడూ ఉత్తరం నుండి దక్షిణం లేదా తూర్పు నుండి పడమర దిశలో నిర్మించాలి. మెట్లు వంకరగా ఉండకూడదు.

లివింగ్ ఏరియా:
ఇంటికి లివింగ్ ఏరియా చాలా మంచిది. ఆనందాలు, సంబంధాలన్నీ కూడా లివింగ్ ఏరియాపైన్నే ఆధారపడి ఉంటాయి. ఈ స్థలాన్ని శుభ్రంగా ఉంచడం ద్వారా, మీరు నిరాశ, ఒత్తిడిని నివారించవచ్చు. ఈ స్థలంలో ఎల్లప్పుడూ లైట్‌ను ఆన్‌లో ఉంచండి. ఇక్కడ తేలికపాటి సువాసనను కూడా ఏర్పాటు చేయండి. మీరు ఇక్కడ పువ్వులు లేదా పువ్వుల చిత్రాలను కూడా ఉంచవచ్చు. ఇక్కడ ఎప్పుడూ బూట్లు, చెప్పులు ఉంచవద్దు.

ఇంటి వంటగది:
ఇంటికి వంటగదిలో సరైన దిశలో ఉండాలి. వంటగదికి వాస్తుశాస్త్రానికి దగ్గరి సంబంధం ఉంటుంది. వంటగది వాస్తు ప్రకారం లేనట్లయితే అనారోగ్యపాలవ్వడం గ్యారెటీ. వంటగదిలో సూర్యకాంతి ఉంటే చాలా మంచిది. వంటగదిలో ఎల్లప్పుడూ వస్తువులను క్రమబద్ధంగా ఉంచండి. పూజ అనంతరం వంటగదిలో దూపదీపారధన తప్పనిసరిగా చేయాలి.

బెడ్‌రూమ్:
ఇంటి ఈ ప్రదేశం నుండి ఆనందం, శ్రేయస్సు కనిపిస్తుంది. పడకగది గోడల రంగును ఎల్లప్పుడూ తేలికగా ఉంచండి. లేత ఆకుపచ్చ లేదా గులాబీ రంగు ఉత్తమం. పడకగదిలో ఎప్పుడూ టీవీ పెట్టకండి. మీరు ఇక్కడ తేలికపాటి సంగీతాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. వీలైనంత వరకు ఇక్కడ తినడం మానుకోండి. పడకగదిలో తగినంత సూర్యకాంతి, గాలి ఉండేలా చూసుకోండి.

బాత్రూమ్: 
ఇంట్లోని బాత్‌రూమ్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ స్థలంలో నీటిని వృథా చేయవద్దు. బాత్రూంలో నీలం లేదా ఊదా రంగును ఉపయోగించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బాత్‌రూమ్‌లో కాస్త సువాసన ఉండే ఫెర్యూమ్స్ వాడుతుండాలి.