Site icon HashtagU Telugu

Lord Srirama: రాములోరి కళ్యాణంలో పాల్గొనాలంటున్నారా.. అయితే ఈ వివరాలు తెలుసుకోండి

Badrachalam

Badrachalam

Lord Srirama: సీతారాముల కళ్యాణం అనగానే మనకు భద్రాచలం రామయ్య గుర్తుకు వస్తాడు. ఏప్రిల్‌ 17న సీతారాముల వారి కల్యాణం, 18న మహా పట్టాభిషేకం వేడుకల్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీతారాముల కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవాల కోసం మార్చి 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ వేడుకల్లో పాల్గొనాలని భావించే భక్తులు ఆన్‌లైన్‌లో ముందే టికెట్లు బుక్‌ చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.భద్రాచలం సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో ఏప్రిల్‌ 17న శ్రీరామనవమి సందర్భంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు, ప్రత్యక్షంగా కళ్యాణం, పట్టాభిషేక కార్యక్రమాలను వీక్షించేందుకు సెక్టార్‌ టికెట్లను సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటించారు.శ్రీరామనవమి రోజు ఉభయ దాతల సేవా టికెట్‌ రుసుము రూ.7,500గా నిర్ణయించారు. ఈ టిక్కెట్‌పై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. రూ.2500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టికెట్లపై ఒక్కరికి ప్రవేశం కల్పిస్తారు.18వ తేదీన జరిగే పట్టాభిషేక మహోత్సవం సెక్టార్‌ టికెట్ల ధరను రూ.1500, రూ.500, రూ.100గా నిర్ణయించారు.