Deeparadhana: అష్టైశ్వర్యాలు కలగాలంటే ఏ సమయంలో ఏ నూనెతో దీపారాధన చేయాలో తెలుసా?

భారతదేశంలో హిందువులు ఉదయం సాయంకాలం రెండు పూటలా పూజ చేస్తూ ఉంటారు. పూజ చేస్తూ ఉంటారు కానీ ఏ సమయానికి చేయాలి? ఎటువంటి నూనెను ఉప

  • Written By:
  • Publish Date - August 2, 2023 / 09:00 PM IST

భారతదేశంలో హిందువులు ఉదయం సాయంకాలం రెండు పూటలా పూజ చేస్తూ ఉంటారు. పూజ చేస్తూ ఉంటారు కానీ ఏ సమయానికి చేయాలి? ఎటువంటి నూనెను ఉపయోగించాలి? అన్న విషయాలు చాలా మందికి తెలియదు.. మరి ఆ వివరాల్లోకి వెళితే.. కాగా శాస్త్రం ప్రకారం దీపారాధన ఉదయం, సాయంత్రం రెండు సమయాలలో చేయడం మంచిది. తెల్లవారుజామున, సాయంత్రం ఇలా రెండు గడియల్లో దీపారాధన చేస్తేమంచి ఫలితాలు కనిపిస్తాయి. సూర్యోదయానికి ముందు అంటే 3 నుంచి 6 గంటలలోపు సమయాన్ని అమృత ఘడియలుగా భావిస్తారు. ఎవరైతే సూర్యోదయానికి ముందు పూజ చేస్తారో వారికి శుభఫలితాలు ప్రాప్తిస్తాయి.

విష్ణుమూర్తిని సూర్యోదయానికి ముందు స్త్రీగానీ, పురుషుడుగానీ ఎవరైతే దీపారాధన చేసి ఆరాధిస్తారో వెంటనే ఆయన మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. అలాగే సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంట్లో, తులసికోట వద్ద దీపారాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సాయంత్రం వేళల్లో ముఖ్యంగా లక్ష్మీదేవిని ఆరాధించాలి. 6:30 తర్వాత లక్ష్మీదేవిని ఆరాధిస్తే లక్ష్మీకటాక్షం పొందుతారు. అలాగే ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో దీపారాధన చేయడం మంచిది. సాయంత్రం పూజ చేయడానికి కుదరని వారు ఉదయం చేసినా మంచి ఫలితం ఉంటుంది. లక్ష్మీకటాక్షం పొందడం కోసం, ఆర్థిక సమస్యలు తొలగిపోవడం కోసం సాయంత్రం 6:30 తర్వాత స్త్రీ గానీ, పురుషుడు గానీ పూజా మందిరంలో, తులసి కోట వద్ద, గుమ్మానికి రెండు పక్కల దీపారాధన చేసి లక్ష్మీ సహస్రనామం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, కనకదార స్తోత్రం కానీ పట్టిస్తే లక్ష్మీ అనుగ్రహం కలిగి చేస్తున్న వ్యాపారంలో ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి.

వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే అష్టైశ్వర్యాలు పొందడం కోసం ఉదయం 6 లోపు దీపారాధన చేయడం మంచిది. అలాగే చాలామంది దీపారాధనకు ఏ నూనె ఉపయోగిస్తే మంచిదని ఆలోచిస్తారు. అద్భుతమైన ఫలితాలను పొందడం కోసం ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ఉత్తమం. ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. కనుక దీపారాధనకు ఆవునెయ్యిని ఉపయోగించడం మంచిది. అలాగే దీపారాధన కోసం నువ్వుల నూనెను ఉపయోగించిన అద్భుత ఫలితాలు పొందగలుగుతారు. ఆవునెయ్యి, నువ్వుల నూనెలతో దీపారాధన చేస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే వేరుశెనగ నూనెతో దీపారాధన చేయరాదు. దీపారాధన చేయడానికి ఒక వత్తిని వెలిగించరాదు. దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంత సేపు పూజ మందిరం తలుపులు వేయరాదు. తెరిచి ఉంచడం మంచిది.