Vastu Tips : ఖర్చులేకుండా భారీ లాభం కావాలా…అయితే ఈ రోజే ఈ మూడు పనులు స్టార్ట్ చేయండి…

నేటికాలంలో చాలా మంది వాస్తును (Vastu Tips) నమ్ముతున్నారు. ఏ పని మొదలుపెట్టాలన్నా వాస్తు ప్రకారమే ప్రారంభిస్తున్నారు. పండితుల సలహాలు తీసుకుంటున్నారు. ఇల్లు ప్రారంభించినది మొదలు పాదరక్షలు పెట్టే వరకు అన్నీ వాస్తుప్రకారమే జరుగుతున్నాయి. ప్రతీదీ వాస్తు ప్రకారం జరుగుతూనే ఆ ఇంట్లో ఆనందం,శ్రేయస్సు, శాంతి అనేది ఉంటుంది. అయితే కొంతమంది రాత్రింభవళ్ళూ కష్టపడి పనిచేస్తుంటారు. కానీ చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. అలాంటి వారు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. వాస్తు శాస్త్రంలో అనేక విషయాల […]

Published By: HashtagU Telugu Desk
Deeparadhana Niyamalu

Deeparadhana Niyamalu

నేటికాలంలో చాలా మంది వాస్తును (Vastu Tips) నమ్ముతున్నారు. ఏ పని మొదలుపెట్టాలన్నా వాస్తు ప్రకారమే ప్రారంభిస్తున్నారు. పండితుల సలహాలు తీసుకుంటున్నారు. ఇల్లు ప్రారంభించినది మొదలు పాదరక్షలు పెట్టే వరకు అన్నీ వాస్తుప్రకారమే జరుగుతున్నాయి. ప్రతీదీ వాస్తు ప్రకారం జరుగుతూనే ఆ ఇంట్లో ఆనందం,శ్రేయస్సు, శాంతి అనేది ఉంటుంది. అయితే కొంతమంది రాత్రింభవళ్ళూ కష్టపడి పనిచేస్తుంటారు. కానీ చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. అలాంటి వారు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. వాస్తు శాస్త్రంలో అనేక విషయాల గురించి ప్రస్తావించారు. వీటిని అనుసరించడం ద్వారా కోటీశ్వరులు కావచ్చు. ఈ నివారణలు చేయడానికి మీరు ఒక్కరూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీరు ఎక్కువ ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. అలాంటి కొన్ని చర్యల గురించి తెలుసుకోండి.

సాయంత్రం పూట ఈ వస్తువులు ఎవరికీ ఇవ్వకండి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సాయంత్రం పూట ఎంత దగ్గరివారైనా సరే పాలు, పెరుగు, ఉప్పు, నూనె అడుగుతే ఎట్టిపరిస్థితుల్లో దానం చేయకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో నివసించే వారి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు అనేక ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

మంచం మీద తినవద్దు:
ఈ రోజుల్లో మంచం మీద కూర్చొని తినే ఫ్యాషన్ నడుస్తోంది. ఇది పూర్తిగా తప్పు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో నివసించే వారి అదృష్టం పూర్తిగా తొలగిపోతుంది. మీరు టేబుల్ లేదా కుర్చీపై కూర్చున్నప్పుడు లేదా కూర్చొని తినవచ్చు. కానీ ఎప్పుడూ మంచం మీద కూర్చొని ఆహారం తినకూడదు.

ఇంటి ప్రధాన ద్వారం వద్ద డస్ట్‌బిన్‌ను ఉంచవద్దు
ఇంటి మెయిన్ డోర్ వద్ద ఎప్పుడూ డస్ట్ బిన్ పెట్టకూడదు. ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల ఇంట్లోని లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది. అందువల్ల, ఇంట్లో డస్ట్‌బిన్‌ను ఎల్లప్పుడూ ప్రధాన ద్వారం నుండి దూరంగా ఉన్న ప్రదేశంలో ఇతరులకు కనిపించని ప్రదేశంలో ఉంచండి.

  Last Updated: 28 Mar 2023, 06:24 PM IST