మీరు ప్రతి విషయంలోనూ ఎక్కువ టెన్షన్ పడుతున్నారా? జీవితంలో చింతల నుంచి విముక్తి పొందాలా? అయితే నీమ్ కరోలి బాబా చెప్పిన ఒక విలువైన మంత్రం గురించి తెలుసుకోండి.
నీమ్ కరోలి బాబాను దైవిక వ్యక్తిగా ప్రజలు భావించేవారు. ఆయనను హనుమంతుని అవతారంగా కూడా అనుకునే వారు. బాబా ఎల్లప్పుడూ ఇతరులకు సేవ చేయడానికే ప్రాధాన్యతనిస్తూ ఉండేవారు. మానవ సేవ అనేది భగవంతునికి భక్తునికి మధ్య ఉత్తమ మాధ్యమం అని భావించే వారు. జీవితంలోని అన్ని కష్టాల నుంచి విముక్తి పొందడానికి కొన్ని ముఖ్యమైన విషయాలను నీమ్ కరోలి బాబా చెప్పారు.
నీమ్ కరోలి బాబాను అద్భుత బాబాలలో ఒకరిగా పరిగణిస్తారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని అక్బర్‌పూర్ గ్రామంలో 1900 ప్రాంతంలో జన్మించాడు. ఆయన భక్తులు ఆయనను హనుమంతుని అవతారంగా భావిస్తారు. ఆయన సాధారణ వ్యక్తి. ఆయన భక్తి యోగం ద్వారా భగవంతుడిని పూజించేవారని అంటారు. జీవితంలో ఎక్కువ ఇబ్బందులు పడే వారి కోసం నీమ్ కరోలి బాబా కొన్ని ప్రత్యేక విషయాలను చెప్పారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* కేవలం దేవుడిని ప్రార్థించండి.
* మనిషి తన చింతలను ఎప్పటికీ ముగించలేడని నీమ్ కరోలి బాబా అన్నారు. దీనికి కారణం ఒకవైపు మనిషి దేవుణ్ణి నమ్ముతూనే.. మరోవైపు తన కష్టాలు ఎప్పటికైనా తీరతాయా అని కూడా అనుకోవడం.
* దేవుణ్ణి నమ్మేవాడూ, చింతించేవాడూ ఇద్దరూ ఒకే మనసులో కూర్చోలేరు. మీరు దేవుణ్ణి విశ్వసిస్తే మీరు చింతించాల్సిన అవసరం లేదని అర్థం. ఒకవేళ మీరు చింతిస్తే దేవుణ్ణి పూర్తిగా నమ్మరని అర్ధం.
*మనిషి ఏదో తెచ్చుకోవడానికి వెళ్తాడు. కానీ ఏదో ఒకదానితో తిరిగి వస్తాడని బాబా చెప్పేవారు.
* మనం పని చేస్తాం. కానీ మనం దేవునికి ఏ ప్రార్థనలు చేస్తామో, అది కూడా చాలా ముఖ్యం అని బాబా అనేవారు.
* కానీ జీవితంలో మనం కోరుకున్నది మనకు ఎల్లప్పుడూ లభిస్తుందని ఎప్పుడూ అనుకోకూడదు.
* భగవంతుడు ఏది చేసినా అది అందరి మేలు కోసమే అని బాబా చెప్పేవారు.
* ఒక్కోసారి మనం దేవుడిని అడిగినవి పొందడం కూడా జరుగుతుంది. కానీ కోరిక తీరకపోతే దేవుడు మనకోసం ఇంకేదో ఆలోచించాడని అర్థం.
* మనిషి ఇంకేదైనా కోరుకుంటాడు కానీ వేరొకటి పొందుతాడు అని బాబా చెప్పేవారు.
* మన కర్మలు చెడ్డవి కానట్లయితే, మనకు కూడా ఊహించని విధంగా మంచి ఫలితం లభిస్తుంది.
* మన కర్మలు చెడుగా ఉంటే లేదా మనం ఎవరి గురించి చెడుగా ఆలోచిస్తున్నామో, దాని ప్రకారం మనకు ఫలం వస్తుంది అని బాబా చెప్పారు.
* కర్మలను బట్టి మనుషులు ఫలితం పొందుతారు.
* ఒక వ్యక్తి ఆత్మహత్య గురించి ఎప్పుడూ ఆలోచించకూడదని బాబా అనేవారు.దీనికి బదులుగా మీరు మీ పనులపై గరిష్ట శ్రద్ధ వహించాలి.
* మంచి పనులతో పాటు తెలిసి, తెలియక కొన్ని తప్పుడు పనులు చేస్తే మిశ్రమ ఫలితాలు వస్తాయి. అందుకే అస్సలు చింతించకండి, ఆలోచనపై, మీ పనిపై దృష్టి పెట్టండి అని బాబా అన్నారు.
* చింత మరియు ధ్యానం యొక్క అర్థం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మూర్ఖులు చింతిస్తారు. చింతించడం మన పని కాదు. మన పనులు చక్కగా చేయడమే మన పని. ఎల్లప్పుడూ ప్రతి పనిలో మీ బెస్ట్ ఎఫర్ట్ పెట్టండి అని బాబా అనేవారు.
* మీరు జీవితంలో ఏదైనా వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే, దానిలో కూడా అన్ని పనులను చక్కగా చేయండి. ఏదైనా పని చేసే ముందు దాని గురించి ఆలోచించి ఆ పని చేయండి అన్నారు.
* పని చేసిన తరువాత, దాని గురించి అస్సలు చింతించకండి. దానిని దేవునికి వదిలివేయండి అని బాబా అన్నారు.
* సానుకూల ఫలితమే వస్తుందని నమ్మండి. చింతించకండి.. ఆందోళన నుండి బయటపడటానికి ఇదే అతిపెద్ద నియమం.
* మనిషి తన మనసును గాయపరిచే ఉద్దేశాలను మనస్సులో సృష్టించుకోకూడదని బాబా చెప్పేవారు.
* మీరు ఏదైనా పని చేసినప్పుడు మీ మనస్సులో ఒక ఉద్దేశ్యాన్ని ఏర్పరచుకోండి. మీరు కష్టపడి పనిచేసినప్పుడు పనిలో సానుకూల ఫలితాలు సాధించబడతాయి. ప్రతికూలతకు దూరంగా ఉండండి. భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండండి.