Site icon HashtagU Telugu

Vastu: కలలో లక్ష్మీదేవితోపాటు ఈ వస్తువులు కనిపిస్తున్నాయా..? అయితే అదృష్టం మీ తలుపు తట్టినట్లే..!!

Dream Interpretation

Dream Interpretation

నిద్రిస్తున్న సమయంలో కలలు రావడం సాధారణం. కానీ కొంతమందికి ఆ కలలు గుర్తుంటాయి. కొందరికి గుర్తుండవు. కలలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి మంచివి…రెండు చెడ్డవి. స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు నిజం అవుతాయని చెబుతోంది. ఇంకొన్ని భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి సూచిస్తాయని ఉంది. అలాంటి కొన్ని కలల గురించి స్వప్న శాస్త్రంలో వివరించారు. ముఖ్యంగా లక్ష్మీదేవితోపాటు మరికొన్ని వస్తువులు కలలో కనిపించినట్లయితే…వారి కుటుంబంలో అంతా మంచి జరుగుతుందని సూచిస్తుందట. అవేంటో తెలుసుకుందాం.

లక్ష్మీదేవిని కలలో చూడటం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కలలో లక్ష్మీదేవిని చూస్తే…అమ్మవారి అనుగ్రహాం మీపై ఉంటుందని నమ్ముతారు. ఈ కల సంపద రాకను సూచించడంతోపాటు అదృష్టాన్ని తీసుకువస్తుందని చాలా మంది నమ్ముతుంటారు.

గుడ్లగూబ:
కలలో లక్ష్మీదేవితోపాటు గుడ్లగూబను చూడటం కూడా శుభ సంకేతం. మీరు మీ సమస్యల నుండి బయటపడతారని దీని అర్థం. కాబట్టి నమ్మకంతో పని ప్రారంభించండి. కచ్చితంగా దానిలో విజయం సాధిస్తారు.

వినాయకుడిని చూడటం:
గణేశుడిని ఆనందం, శ్రేయస్సు యొక్క చిహ్నాలుగా భావిస్తారు. దీపావళి సందర్భంగా ఇలాంటి కల చూస్తే జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయి.

లక్ష్మీనారాయణుడు:
కలలో లక్ష్మీ నారాయణుని బొమ్మ లేదా విగ్రహాన్ని చూసినట్లయితే మీ కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం. ఎందుకంటే సంపద నారాయణుని రూపాన్నిలక్ష్మీదేవి విజయానికి సూచికగా భావిస్తారు.

లక్ష్మీదేవిని పూజిస్తున్నట్లు:
లక్ష్మీదేవికి పూజ చేసినట్లుగా మీకు కల వస్తే మీ అదృష్టానికి తలుపులు తెరుచుకోబోతున్నాయని అర్థం. మీరు వ్యాపారంలో,ఉద్యోగంలో వ్యాపారంలో లాభం పొందుతారని దీని అర్థం.

 

Exit mobile version