Bed Vastu : బెడ్‌ కింద ఇవి పెట్టారో.. మీ ఇంట్లో అలా జరుగుతుంది!

Bed Vastu : చాలామంది బెడ్​రూమ్​లో ఏదిపడితే అది పెట్టేస్తుంటారు. బెడ్ కింద కూడా అన్నీ అడ్జస్ట్ చేస్తుంటారు.

Published By: HashtagU Telugu Desk
Vastu Tips

Bed Vastu

Bed Vastu : చాలామంది బెడ్​రూమ్​లో ఏదిపడితే అది పెట్టేస్తుంటారు. బెడ్ కింద కూడా అన్నీ అడ్జస్ట్ చేస్తుంటారు. వాస్తవానికి ఇలా చేయొద్దని వాస్తుశాస్త్రం చెబుతోంది.  దీన్ని పట్టించుకోకుంటే.. వాస్తుదోషం వస్తుందని విశ్వసిస్తుంటారు. మనం ఇంటి నిర్మాణం, గదులు, ఇంట్లోని వస్తువులు ఇలా అన్నింటిలోనూ వాస్తు నియమాలను పాటిస్తుంటాం. ఇలా వాస్తు నియమాలను పాటించడం వల్ల ఇంట్లో పాజిటివ్‌ వాతావరణం ఉంటుంది. ఇంటి నిర్మాణమే కాదు.. ఇంటి లోపలి వస్తువుల సర్దుబాటు విషయంలోనూ వాస్తు రూల్స్‌ను పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే బెడ్‌రూమ్‌లో కొన్ని వస్తువులు ఉంచకూడదని చెబుతున్నారు. వీటి వల్లే భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం, ఇంట్లో అశాంతి నెలకొనడం వంటివి జరుగుతుంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. బెడ్​ రూమ్​ను ఎలా ఉంచుకోవాలో.. బెడ్‌ కింద(Bed Vastu) ఎటువంటి వస్తువులను పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

  • చెక్కతో చేసిన వస్తువులు ఏవైనా విరిగిపోతే వాటిని బెడ్‌ కింద పెట్టకూడదు. వీటిని మంచం కింద పెట్టడం వల్ల భార్యభర్తల మధ్య అనుబంధం దెబ్బతింటుందట. కాబట్టి.. ఏవైనా వస్తువులు పాడైపోతే వాటిని స్టోర్‌రూమ్‌లో మాత్రమే ఉంచాలని సూచిస్తున్నారు.
  • కొంత మంది బూట్లు, చెప్పులను బెడ్‌ కింద పెడుతుంటారు. ఇలా బూట్లు, చెప్పులను బెడ్‌రూమ్‌లోకి తీసుకురావద్దని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఒకవేళ బెడ్ రూంలోకి  చెప్పులను తీసుకొస్తే.. వాటికి అంటుకున్న మలినాలు, నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దీంతో మనం అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • చీపురును బెడ్ కింద పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతాయట. అందుకే బెడ్ రూంను శుభ్రం చేసిన తర్వాత చీపురును మూలకు పెట్టాలి.
  • ఎలక్ట్రానిక్ పరికరాలను బెడ్‌ కింద పెట్టకూడదు. దీనివల్ల భార్యభర్తల మధ్య అనవసరంగా గొడవలు వస్తాయి. ఈ పరికరాల వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుందట. కాబట్టి వీటిని బెడ్‌రూమ్‌ బయట ఎక్కడైనా పెట్టాలి.
  • చెత్త, చెల్లాచెదురుగా ఉండే వస్తువులను బెడ్‌ కింద పెట్టడం వల్ల నిద్రకు భంగం కలుగుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు. అలాగే పాత బట్టలను కూడా బెడ్ కింద ఉంచొద్దని సూచిస్తున్నారు. బెడ్‌ కింద ఎల్లప్పుడూ ఖాళీ స్థలం శుభ్రంగా ఉండాలని తెలియజేస్తున్నారు. బెడ్ విషయంలో వాస్తు నియమాలను పాటిస్తే చాలామంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : Vote Vs Eat : అమ్మానాన్న నాకు ఓటేయకుంటే అన్నం తినొద్దు.. స్కూల్ పిల్లలకు ఎమ్మెల్యే పాఠాలు

గమనిక: ఈ సమాచారం వివిధ మాధ్యమాల నుంచి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. దీని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.

  Last Updated: 11 Feb 2024, 02:08 PM IST