Water Lilies : కలువ పూలు.. వాసనలో మల్లె ఎంత గొప్పదో.. అందంలో కలువ అంత గొప్పది. కలువ పూలను దేవతా పుష్పం అని పిలుస్తారు. ఈ పువ్వు ఎంత గొప్పదంటే.. హిందూ దేవతల చేతుల్లో ఇది కచ్చితంగా కనిపిస్తుంది. ఇవాళ కార్తీక మాసం మొదలైంది. ఈ మాసంలో సహస్ర కమలం వంటి పువ్వులతో పూజిస్తే ఎంతో పుణ్యమంటారు. వందల రకాల పూలతో చేసిన పూజ అనేది ఒక్క కలువ పువ్వుతో చేసిన పూజకు సమానమవుతుందని పెద్దలు అంటారు. అందుకే కలువ పువ్వును పవిత్రంగా భావిస్తారు. ఐశ్వర్యానికి అధిదేవత లక్ష్మీ దేవి కలువ పూవులోనే కూర్చుని ఉంటుంది. ఆమెకు ఇష్టమైన పువ్వు కూడా ఇదే. లక్ష్మీ దేవిని కమలాలు, తెల్లటి సువాసన గల కలువ పూలతో పూజిస్తే కరుణిస్తుంది. ఈ పూలు ఎక్కువగా చెరువుల్లో, నీటి కొలనుల్లో, భారీ సరస్సులలో, కొన్ని కాలువల్లో కనిపిస్తాయి. ఇవి తెలుపు, గులాబీ, నీలం రంగుల్లో ఉంటాయి. కలువ పూలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం. మామూలు రోజుల్లో ఒక కలువ పువ్వు ధర 10 రూపాయలు ఉంటే.. కార్తీక మాసంలో మూడు కలువ పూల రేటు 50 రూపాయల దాకా(Water Lilies) పలుకుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఏ దేవతకు ఏ పూలతో పూజ చేయాలి ?
- ఎరుపు, నారింజ రంగుల్లో ఉండే బంతిపూలంటే వినాయకుడికి ఇష్టం. తులసి తప్ప మిగిలినవన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు.
- చదువుల దేవత సరస్వతీదేవికి ఇష్టమైన రంగు పసుపు. సరస్వతికి మోదుగు పూలతో పూజ చేయడం మంచిది.
- ఉమ్మెత్త చెట్లకు గుండ్రంగా ముళ్లతో కూడిన కాయల్లాంటివి కాస్తాయి. ఆ కాయలంటే శివుడికి మహా ఇష్టం. వాటితో శివుడికి పూజ చేయాలి.
- కాళీ మాత నాలుక రంగులో పూచే పూలు ఎర్రమందారాలు. 108 ఎర్ర మందారాలతో మాల కట్టి కాళీ మాత మెడలో వేసి నమస్కరిస్తే కోరిక కోరికలు తీరుతాయంటారు. కాళీ దేవికి ముదురు ఎరుపు గులాబీ పువ్వులు కూడా సమర్పిస్తారు.
- సువాసన వెదజల్లే పారిజాత పూలంటే శ్రీ మహావిష్ణువుకు మహా ప్రీతి.
- హనుమాన్ పూజ సమయంలో మల్లెపూల నూనెను సమర్పిస్తారు.
- శ్రీకృష్ణుడిని పూజించడానికి పారిజాత పుష్పం బెస్ట్.
- నీలిరంగు పూలను శనిదేవుడికి సమర్పించాలి. నీలం శంఖం పువ్వుతో సహా ఇతర నీలం పుష్పాలను శని భగవానుడికి సమర్పించవచ్చు.
Also Read: Religious conversions : మత మార్పిడికి అడ్డాగా టీటీడీ పుష్కరిణి..భక్తులు ఆగ్రహం
గమనిక: ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాన్ని వినియోగదారులు కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.