Site icon HashtagU Telugu

Tirumala: వేంకటేశ్వరస్వామికి గోవిందా అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా

Tirumala New

Tirumala New

Tirumala: ఒకనాడు వెంకటేశ్వర స్వామి వారు అగస్త్య ముని దగ్గరకు వెళ్తారు. అగస్యముని తో నా పేరు శ్రీనివాసులు అంటారు నీ దగ్గర చాలా గోవులు ఉన్నాయని తెలిసి వచ్చాను అందులో ఒక దానిని నాకు ఇవ్వవా అనే స్వామివారు అగస్త్య ముని తో అడుగుతారు. ముని చాలా సంతోషించి స్వామి మీకు ఇవ్వటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వేదాల ప్రకారం సహచారినిఉంటే గాని గోవుని ఇవ్వకూడదు అంటారు.  కాబట్టి స్వామి మీరు సతీమణితో మరోసారి రాగలరు అప్పుడు స్వామి సరే అని వెళ్ళిపోతారు.

ఒక్కరోజు అగస్త్య ముని ఆశ్రమంలో లేనప్పుడు పద్మావతి అమ్మవారు సతీసమేతంగా ఆశ్రమానికి వస్తారు. ఆశ్రమంలో శిష్యుని అడుగుతారు మీ గురువుగారు సతీసమేతంగా వచ్చి గోవును స్వీకరించండి అన్నారు మాకు గోవునిస్తారు చెప్పారు. అప్పుడు శిష్యుడు మా గురువుగారు లేరు ఆయన ఆదేశాలు లేకుండా నేను ఏమి చేయలేను మీరు మరోసారి ఆయన ఉన్నప్పుడు గోవును తీసుకొని వెళ్లండి అని శిష్యుడు పలుకుతాడు. దాంతో స్వామి వారు ఆగ్రహించి తిరుమల కొండ వైపు గబగబా నడుచుకుంటూ వెళ్తారు.

అంతలో అగస్యముని ఆశ్రమానికి రాగానే శిష్యుడు జరిగిన ఉత్తాంతం వివరిస్తాడు దాంతో ముని ఒక గోవును తీసుకొని శిష్యుల్ని మరి కొంతమందిని వెంటపెట్టుకొని శ్రీనివాస స్వామి వైపు పరిగెడతారు స్వామివారు కాస్త దూరంలో కనిపించక అతను స్వామి “గో ఇంద”గట్టిగా అరవ సాగారు స్వామి వినిపించకుండా వెళ్ళిపోతా ఉన్నారు శిష్యులందరూ గట్టిగా మరి గట్టిగా స్వామి గో ఇంద గో అంటే ఆవు ఇంద అంటే ఇదిగో అలా శిష్యులందరూ గో ఇంద గో ఇంద గోవింద గోవింద అంటూ పిలుస్తూ గట్టిగా అరుస్తూ స్వామివారు అదృశ్యం అవుతారు.

Exit mobile version