Temples Rituals : దేవాలయాల్లో ఇలాంటి వస్తువులను ఎందుకు నిషేధించారో తెలుసా

హిందూ (Hindu) మతంలో పూజలు చేయడానికి అనేక రకాలైన పద్ధతులు, నియమాలు ఉన్నాయి.

హిందూ మతంలో పూజలు చేయడానికి అనేక రకాలైన పద్ధతులు, నియమాలు ఉన్నాయి. ఆలయాలను దేవతల నివాసంగా పరిగణిస్తారు. మనం ఇళ్లలో ఉండే పూజా గదిలో ఉండే దేవుడిని పూజించే సమయంలోనే అనేక పద్ధతులు, ఆచారాలు పాటిస్తూ ఉంటాం. అలాంటిది అత్యంత పవిత్రమైన దేవస్థానంగా పరిగణించే దేవాలయాలకు వెళ్తున్నామంటే మరింత నిష్టగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఆలయంలో మనం ప్రవేశించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటారు. గురువులకు సంబంధించిన దేవాలయాలకు వెళ్లేటప్పుడు కచ్చితంగా షర్ట్, టీషర్టును తొలగించాలి. పురుషులందరూ అర్ధనగ్నంగానే స్వామి వారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా కొన్ని దేవాలయాల్లో (Temples) కొన్ని రకాలైన వస్తువులను ఎప్పటికీ అనుమతించరు. అందులో లెదర్ వస్తులు ఒకటి. ఈ సందర్భంగా దేవాలయాల్లో (Temples) తోలు వస్తువులను ఎందుకు వాడకూడదనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతి ఒక్కరూ గుడిలోకి వెళ్లే ముందు పాదరక్షలు గుడి బయటే వదలి వెళతారు. చెప్పులను ఎలా బయట వదలేసి వెళ్తారో అలాగే లెదర్ తో తయారైన వస్తువులను కూడా తీసుకెళ్లకూడదు. ముఖ్యంగా లెదర్ పర్స్, బెల్టు, జాకెట్, క్యాప్, బ్యాగ్ వంటి తోలు వస్తువులను బయటే ఉంచాలి. ఎవరైనా పొరపాటున తెలిసో తెలియకుండా లెదర్ వస్తువులను గుడి లోపలికి తీసుకెళ్తే మీరు ఎన్ని ప్రత్యేక పూజలు చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంతేకాదు ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది.

అపవిత్రంగా పరిగణిస్తారు:

దేవాలయం లోపల పూజా సమయంలో తోలుతో చేసిన వస్తువులను నిషేధించారు. ఎందుకంటే వాటిని చనిపోయిన జంతువుల చర్మంతో తయారు చేస్తారు. అందుకే వీటిని పొరపాటున కూడా దేవాలయంలోకి అనుమతించరు. మీరు కూడా వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ గుడి లోపలికి తీసుకెళ్లకూడదు. అలాగే మరో కారణం ఏంటంటే.. మీ బట్టలు మురికిగా మారిన తర్వాత వాటిని ఉతికిన తర్వాత శుభ్రం చేసుకోవచ్చు. అయితే తోలుతో చేసిన వస్తువులను ఇలా శుభ్రం చేయలేం. వాటిలోకి నీరు ప్రవేశించిన వెంటనే అది పాడవడం ప్రారంభమవుతుంది. అందుకే తోలుతో చేసిన వస్తువులను అపవిత్రంగా పరిగణిస్తారు.

మనం ఆధ్యాత్మిక వాతావరణంలో గడపడం వల్ల దైవిక శక్తులు మనకు సానుకూల ఫలితాల్నిస్తాయి. గుడికి వెళ్లి భగవంతుడిని దర్శించుకోవడం వల్ల సంతోషకరమైన జీవితం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. గుడిలోకి పాదరక్షలు నిషేధించడం వెనుక మరో కారణం కూడా ఉంది. ఆలయం పూజలు చేసే పవిత్రమైన ప్రదేశం కాబట్టి అక్కడ పాదరక్షలతో తిరిగితే వాటి నుంచి వచ్చే శబ్దానికి గుడిలోని వేదమంత్రాలు వినిపించవు. అలాగే మనం రహదారిపై ఏది పడితే అది తొక్కుకుంటూ వెళ్తూ ఉంటాం. వాటిని తొక్కి గుడిలోకి వెళ్తే అది అపవిత్రంగా మారుతుందని చాలా మంది నమ్ముతారు.

Also Read: Home Doorstep: మీ ఇంటి గుమ్మాన్ని ఇలా అలంకరించుకోండి