Site icon HashtagU Telugu

Tirumala: తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు.. ఎందుకు జరుపుతారో తెలుసా

Bomb Threats In Tirumala

Bomb Threats In Tirumala

Tirumala:  తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తుల భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అయితే వసంత రుతువులో మలయప్ప స్వామికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. సాయంత్రం 6:30 నుంచి ప్రారంభం కానున్న కల్యాణం వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందు తలెత్తకుండా ఇప్పటికే టీటీడీ, జిల్లా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు అన్న ప్రసాదం, తాగునీరు, మజ్జిగ అందించనున్నారు.

వేసవి దృష్ట్యా గ్యాలరీల్లో ఎయిర్ కూలర్లు, స్వామి వారి కల్యాణం వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికీ ముత్యాల తలంబ్రాలు, తిరుమల నుంచి తెప్పించిన చిన్న లడ్డూలు పంపిణీ చేయనున్నారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఈసారి దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్ హాజరై పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. కాగా, అన్ని ఆలయాల్లో శ్రీరామనవమి రోజున స్వామి వారికి కల్యాణ వేడుక జరుగుతుంది. అయితే, ఒంటిమిట్టలో మాత్రం నవమి తర్వాత చతుర్దశి రోజున కల్యాణం నిర్వహిస్తారు.అటు, తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) ఈసారి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. 2023 – 24 ఏడాదికి గాను రూ.1,161 కోట్లు, 1,031 కేజీల బంగారం శ్రీవారి హుండీ ద్వారా వచ్చినట్లు అధికారులు తెలిపారు.