ధన్‌తేరస్ రోజున చాలామంది బంగారంతోపాటుగా కొత్త వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఇలా కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అయితే బంగారంతోపాటుగా ధన్యాలను కూడా కొనుగోలు చేస్తారు. వినడానికి విచిత్రంగా ఉన్నా…దీని వెనకున్న కారణం తెలుస్తే షాక్ అవుతారు.
ధంతేరస్ రోజున ధన్యాలను ఎందుకు కొనాలి :
-ధంతేరస్ రోజున ధన్యాలను కొనడం శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ధన్యాలను కొనుగోలు చేస్తారు.
-నగరాల్లో ప్రజలు ధన్యాలను కొనుగోలు చేస్తారు. గ్రామాల్లో ధన్యాలు, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇవి నైవేద్యంగా సమర్పించాలని నమ్ముతుంటారు.
-అంతేకాదు ధంతేరస్ రోజునే కాకుండా లక్ష్మీదేవి పూజలో కూడా ధన్యాలను వాడుతుంటారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆర్థిక స్థితిని మెరుగుపర్చడానికి ధంతేరస్ రోజు ధన్యాలను కొనడం మంచిదని భావిస్తారు. ధంతేరస్ రోజున ధన్యాలతోపాటు చీపుర్లు, గోమతి చక్రాలు, మేకప్ వస్తువులన కొనుగోలు చేస్తారు.
మీరు ఈ కథనాన్ని ఇష్టపడితే..హ్యాష్ ట్యాగ్ యూ తెలుగుతో ఇతర కథనాలను చదవడానికి కనెక్ట్ అవ్వండి.