Vastu Shastra : నవరాత్రుల్లో ఉల్లిపాయ-వెల్లుల్లి ఎందుకు తినకూడదు?

హిందూక్యాలెండర్ ప్రకారం శారదీయ నవరాత్రులు సెప్టెంబర్ 26,2022 నుంచి ప్రారంభం అవుతాయి.

  • Written By:
  • Publish Date - September 20, 2022 / 06:00 AM IST

హిందూక్యాలెండర్ ప్రకారం శారదీయ నవరాత్రులు సెప్టెంబర్ 26,2022 నుంచి ప్రారంభం అవుతాయి. ఈ 9 రోజులూ పండగ వాతావరణం నెలకొంటుంది. ఆలయాలు,ఇళ్లల్లో సందడి వాతావరణం ఉంటుంది. కలశాన్ని ఏర్పాటు చేసి దుర్గామాతను పూజిస్తారు. నవరాత్రుల్ల దుర్గాదేవిని పూజించి ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాస సమయంలో ఒకపూట మాత్రమే ఆహారం తీసుకుంటారు. ఇందులో పండ్లు, కూరగాయలు మాత్రమే ఉంటాయి. ఈ తొమ్మిది రోజులు ఆహారంలో వెల్లుల్లి-ఉల్లిపాయలను తీసుకోవడం నిషిద్ధం. అయితే నవరాత్రుల్లో వెల్లుల్లి-ఉల్లిపాయలు ఎందుకు తినకూడదో తెలుసా?

హిందూమతంలో చాలా నమ్మకాలు ఉన్నప్పటికీ…నవరాత్రుల్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి తినడం విషయానికి వస్తే…ప్రతి ఒక్కరూ ఈ నియమాన్ని తప్పకుండా పాటిస్తారు. హిందూ పురాణాల ప్రకారం పూజ సమయంల లేదా ఏదైనా ఉపవాస సమయంల వెల్లుల్లి, ఉల్లిపాయలను ఉపయోగించకూడదు. ఎందుకంటే దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగినప్పుడు…అందులో 9 రత్నాలు వచ్చాయని…చివరిగా అమృతం వస్తుంది. ఆ తర్వాత విష్ణువు మోహినీ రూపాన్ని ధరించి దేవతలకు అమృతం అందిస్తాడు. అప్పుడు ఇద్దరు రాక్షసులు రాహు-కేతువులుగా మారి అమృతం సేవిస్తారు. దీని తర్వాత విష్ణువు సుదర్శన చక్రాన్ని తీసి అతని తల మొండెం వేరు చేస్తారు. అప్పుడు అతని రక్తం చుక్కలు నేలపై పడతాయి. వెల్లుల్లి ఉల్లిపాయ దాని నుంచే ఉద్భవించిందని నమ్ముతారు. అందుకే ఉల్లిపాయలు, వెల్లుల్లి ఘాటైన వాసనను కలిగి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని చుక్కలు అమృతం రాహు కేతువుల శరీరంలోకి చేరిందని అందుకే వాటికి వ్యాధులతో పోరాడే శక్తి ఉంటుందని చెబుతుంటారు.

ఉల్లి వెల్లుల్లి ఎక్కువగా వాడటం వల్ల మనిషి మనస్సు ఆధ్యాత్మికత వైపు మళ్లుతుందని చెబుతుంటారు. పురాణాల్లో ఉల్లి , వెల్లుల్లి రాజసిక్, తామసిక్ గా పరిగణిస్తారు. తామసిక, రాజస గుణాలు పెరగడం వల్ల మనిషికి అజ్ఝానం పెరుగుతుందని…అందుకే ఎప్పుడూ సాత్వికమైన ఆహారాన్ని తినాలని…ఇలా చేస్తే మనస్సు ఎఫ్పుడూ ఆధ్యాత్మిక భవనవైపు మళ్లుతుందని చెబుతుంటారు. మాంసం, చేపలు, ఉల్లి, వెల్లుల్లి ఇవన్నీ కూడా తామసిక ఆహారాన్ని రాక్షస స్వభావం గల ఆహారం అంటారు. ఇవి తింటే అశాంతి, వ్యాధులు, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తాయి. అందుకే ఉల్లిపాయ, వెల్లుల్లి తినడం హిందూమతంలో నిషేదం.

ఆయుర్వేదం ప్రకారం ఆహారం వాటి స్వభావం, తిన్న తర్వాత శరీరంలో ప్రతిచర్య ఆధారంగా మూడు వర్గాలుగా విభజించారు.
రాజసిక ఆహారం-తామస ఆహారం-సాత్విక ఆహారం
ఉపవాస సమయంలో సాత్విక ఆహారం తీసుకుంటారు. కానీ మతపరమైన విశ్వాసం కాకుండా..దాని వెనక శాస్త్రీయ కారణం కూడా ఉంది. శారదీయ నవరాత్రి అక్టోబర్ నవంబర్ లో వస్తుంది. ఈ సమయంలో సీజన్ శరదృతువు నుంచి శీతాకాలానికి మారుతుంది. వాతావరణ మార్పుల కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడటం ప్రారంభం అవుతుంది. అలాంటి పరిస్థితిలో ఈ సీజన్ లో సాత్విక ఆహారాన్ని తినడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా ఉంటుంది. శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు వస్తాయి. సైన్స్ ప్రకారం ఉల్లిపాయ, వెల్లుల్లి తామసిక స్వభవంగా పరిగణిస్తారు. శరీరంలో మానసిక, భావోద్వేగ శక్తిని పెంచుతాయి. దీని వల్ల మనస్సు సంచరించేలా చేస్తుంది. అందుకు నవరాత్రి సమయంలో వీటిని తినకూడదు.