Holi: కొత్తగా పెళ్ళైన వారు అత్తారింట్లో హోలీ జరుపుకోకూడదా..?

హోలీ అంటేనే రంగురంగుల పండుగ. ఈ రోజున హోలికా దహనం ప్రత్యేకం. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగను ఎంజాయ్ చేస్తారు. చిన్నా పెద్దా అని

Published By: HashtagU Telugu Desk
Mixcollage 20 Mar 2024 07 54 Pm 7331

Mixcollage 20 Mar 2024 07 54 Pm 7331

హోలీ అంటేనే రంగురంగుల పండుగ. ఈ రోజున హోలికా దహనం ప్రత్యేకం. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగను ఎంజాయ్ చేస్తారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఏడాది హోలీ 2024 మార్చి 25వ తేదీన రానుంది. ఈనేపథ్యంలో హోలీ పండుగను కొత్తగా పెళ్లైన మహిళలు మాత్రం అత్తవారింట జరుపుకోకూడదనే అనావయితీ ఉంది. మరి దీని వెనుక ఉన్న రీజన్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఫాల్గుణ మాసంలో వచ్చే పూర్ణిమ రోజు హోలీ పండుగ జరుపుకుంటారు.

దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. ఈ రోజు ప్రభుత్వ సెలవు దినంగా కూడా పాటిస్తారు. హోలీ సందర్భంగా నిర్వహించే హోలికా దహనాన్ని కొత్తగా పెళ్లైన అమ్మాయిలు తమ అత్తవారింట చూడకూడదట. ఒకవేళ పొరపాటున అత్తాకోడళ్లు కలిసి హోలీకా దహనం చూస్తే అత్తా కోడళ్లకు మధ్య గొడవలు జరుగుతాయట. అంతేకాదు హోలికా దహనాన్ని గర్భిణులు కూడా చూడకూడదని పండితులు చెబుతారు. అదే కొత్తగా పెళ్లైన మహిళ పుట్టింట హోలీ పండుగ జరుపుకుంటే మంచిది. పురాణాల ప్రకారం హోలీ పండుగ గురించి రకరకాల కథనాలు చెబుతారు.

శివుడుని పార్వతి దేవి పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. కానీ, శివుడు తపస్సులో మునిగిపోతాడు. అప్పుడు శివయ్యలో ప్రేమను పుట్టించేందుకు కామదేవుడైన మన్మథుడు మన్మథ బాణం వదులుతాడు దీంతో కోపోద్రిక్తుడైనా శివుడు మూడో కన్న తెరచి కామదేవుడిని భస్మం చేస్తాడు. బూడిదగా మారిన తన భర్తను చూసి రతిదేవి వైధవ్యాన్ని మోయాల్సి వస్తుంది.ఆ తర్వాత శివుడికి పార్వతి మొత్తం విషయాన్ని చెప్పింది కానీ, ఇప్పటి వరకు ఆపవాదం కామదేవుడు మోస్తూనే ఉన్నాడు.

  Last Updated: 20 Mar 2024, 11:16 PM IST