పీరియడ్స్ లో ఉన్న మహిళలు తులసి మొక్క దగ్గరికి వెళ్లకూడదు..! ఎందుకొ మీకు తెలుసా?

తులసి మొక్కను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ఈ మొక్క త్వరగా ఎండితుంది.

  • Written By:
  • Publish Date - September 15, 2022 / 09:00 AM IST

తులసి మొక్కను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ఈ మొక్క త్వరగా ఎండితుంది. తులసిని కొన్నిసార్లు సరిగ్గా చూసుకున్నా, అది ఎండిపోతుంది. దీనికి మూలకారణాన్ని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీ ఇంట్లో తులసి మొక్క తరచుగా ఎండిపోతుంటే ఈ టిప్స్ ద్వారా బతికించవచ్చు.

తులసికి చాలా ఎక్కువ లేదా చాలా తక్కువ నీరు పోయవద్దు. ఎక్కువ నీరు పోస్తే  మొక్కను చనిపోతుంది.  తక్కువ నీరు పోస్తే మొక్కను ఎండిపోయేలా చేస్తుంది. ఎక్కువగా నీరు పోస్తే  మొక్క మూలాలు కుళ్ళిపోతాయి. ఫంగస్ చేరుతుంది. ఆదివారం ఏకాదశి నాడు తులసికి నీరు సమర్పించవద్దు. అలాగే తులసి కోటకు కింద చిన్న కన్నం పెట్టాలి. తద్వారా  నీరు బయటకు కారి పోతుంది.

తులసి కాడలను కట్ చేయాలి..
తులసి కాడలను ఎప్పటికప్పుడు తీసివేసి, తులసి నుండి వేరు చేయండి, లేకపోతే తులసి వ్యాధి బారిన పడి వాడిపోతుంది. తులసి కాడలను తొలగించడానికి కూడా నియమాలు ఉన్నాయి. తులసి ఆకులు లేదా కాడ తీయడానికి ముందు తులసీ దేవికి పూజ చేయాలి.  ఆదివారం, ఏకాదశి రోజుల్లో ఈ పని చేయకూడదు. తులసిని గోళ్ళతో తీయకూడదు. చిన్న కత్తెరతో కాడలు కట్ చేయాలి.

తులసిని పవిత్రంగా ఉంచండి
బహిష్టు సమయంలో స్త్రీలు తులసికి దూరంగా ఉండాలి. కాబట్టి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. పురుషులు కూడా స్నానం చేయకుండా తులసిని తాకకూడదు. తులసి కోటపై వస్త్రాన్ని ఆరబెట్టవద్దు.

సరైన పర్యావరణం
తులసి మొక్కను వాతావరణానికి దూరంగా ఉంచాలి. అధిక చలి లేదా వేడి కారణంగా తులసి వాడిపోతుంది. అందుచేత చలికాలంలో తులసి మాత చుట్టూ గుడ్డ లేదా గాజు కవర్ తో కప్పవచ్చు. అధిక ఎండ, వర్షం నుండి తులసిని దూరంగా ఉంచండి. తులసిని పర్యావరణ అనుకూల ప్రదేశంలో ఉంచండి.