Karthika Masam : కార్తీక మాసంలో దీపాలను ఎందుకు వెలిగిస్తారు మీకు తెలుసా?

కార్తీకమాసం (Karthika Masam) అంటేనే దీపాల పండుగ అని చెప్పవచ్చు. కార్తీక మాసాన్ని దేవ దీపావళి అని కూడా అంటారు.

  • Written By:
  • Publish Date - November 16, 2023 / 05:54 PM IST

Karthika Masam : కార్తీకమాసం మొదలైంది. కార్తీకమాసంలో భక్తులు శివాలయాలకు వెళ్లి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఇంట్లో కూడా ప్రత్యేక దీపారాధన చేస్తూ ఇంటి ప్రధాన ముఖ ద్వారం తులసి కోట వద్ద దీపాలను వెలిగిస్తూ ఉంటారు. కార్తీకమాసం (Karthika Masam) అంటేనే దీపాల పండుగ అని చెప్పవచ్చు. కార్తీక మాసాన్ని దేవ దీపావళి అని కూడా అంటారు. కార్తీక మాసంలో శివాలయాలకు వెళ్లి పరమేశ్వరుని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అలాగే కార్తీకమాసం అంతా శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసంలో మరి ముఖ్యంగా కార్తీక పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ కార్తీక పౌర్ణమి రోజున శివుడికి విష్ణుమూర్తికి ప్రత్యేకమైన పూజలు చేయాలి.

We’re Now on WhatsApp. Click to Join.

కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించడం వల్ల తెలిసి తెలియకుండా చేసిన పాపాలు తొలగిపోతాయి. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల ఆ పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి ఈ రోజున తెల్లవారు జామున నదీ స్నానం ఆచరించి ముందు పూజ గదిలో దీపం వెలిగించి తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించాలి. ఇక ఆ రోజంతా ఉపవాసం ఉంది సాయంత్రం 365 వత్తులతో దీపారాధన చేయడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ముఖ్యంగా 365 వత్తులతో దీపారాధన చేయడం వల్ల సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ కార్తీకమాసం (Karthika Masam)లో శివాలయంలో దీపాలు వెలిగించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది.

ఒకవేళ ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయాలకు వెళ్ళలేని వారు ఇంట్లో తులసి కోటమందు అలాగే దేవుడి గదిలో దీపాన్ని వెలిగించడం వల్ల అంతా మంచే జరుగుతుంది. కార్తీక పౌర్ణమినాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడంతో సమానం. శివుని అనుగ్రహం మన మీద ఉంటుంది. సకల పాపాలు తొలగిపోయి సుఖశాంతులతో ఉంటాం. దీపం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. అటువంటి దీపం కార్తీక మాసంలో పెట్టడం ప్రధానం. కార్తీకమాసం (Karthika Masam)లో అగ్నిని ఆరాధన చేయడం, హోమాలు చేయడం మంచిది. అయితే ఈ కాలంలో అగ్ని ఆరాధన చేయడం, హోమాలు చేయడానికి వీలు కుదరదు. కాబట్టి అగ్ని స్వరూపమైనటువంటి దీపాన్ని వెలిగించి ఆరాధించడం ద్వారా అగ్ని ఆరాధన చేసినటువంటి పుణ్య ఫలితం మనకు లభిస్తుంది. అందుకనే ఈ మాసంలో దీపాలు వెలిగిస్తారు.

అయితే దీపారాధన చేయడం మంచిదే కానీ ఎప్పుడు పడితే అప్పుడు చేయకుండా ఉదయం సూర్యోదయానికి ముందు సాయంత్రం సూర్యుడు అస్తమించే వేలలో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి. అలా ఉదయం తులసి దగ్గర పెట్టే దీపం కార్తీక దామోదరుడుకి చెందుతుంది. దేవుని దగ్గర పెట్టే దీపం శివునికి చెందుతుంది. ఈ కార్తీకదీపం లో వెలిగించే సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం దీపం వెలిగించిన తరువాత దీపలక్ష్మీ నమోస్తుతే అని నమస్కరించాలి. ఈ విధంగా చేయడం వల్ల మన చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి.

Also Read:  Five Signs: మీకు కూడా ఈ ఐదు సంకేతాలు కనిపించాయా.. అయితే మీపై నరదృష్టి పడినట్టే?