Site icon HashtagU Telugu

Spirtual: సూర్యాస్తమయం తర్వాత పూలు ఆకులను కోయకూడదు తాకకూడదని ఎందుకు చెప్తారో తెలుసా?

Spirtual

Spirtual

మామూలుగా సూర్యాస్తమయం తరువాత తెలిసి తెలియక కూడా కొన్ని రకాల తప్పులు చేయకూడదని అంటూ ఉంటారు. వాటి వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతూ ఉంటారు. సూర్యాస్తమయం తర్వాత చేయకూడని వాటిలో పువ్వులను అలాగే ఆకులను కోయకూడదని, తాకకూడదు అంటూ ఉంటారు. మరి సూర్యాస్తమయం తర్వాత పూలను కోయడం ఆకులను తాగడం వంటివి చేస్తే ఏం జరుగుతుందో, ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని, సాయంత్రం తర్వాత అవి విశ్రాంతి తీసుకుంటాయని, కాబట్టి ఆ సమయంలో తాగడం లేదంటే పువ్వులు కోయడం వంటివి చేయకూడదని అంటూ ఉంటారు.

ఇది ఒక ధార్మిక నమ్మకం అని చెప్పాలి. మామూలుగా ఎవరైనా పడుకున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు వారికీ ఎలా అయితే ఇబ్బంది కలిగించమో మొక్కలకు కూడా అదే విధంగా సాయంత్రం సమయంలో ఇబ్బంది పెట్టకూడదని చెబుతున్నారు. సాయంత్రం సమయంలో చెట్లు మొక్కలలో పక్షులు చిన్న చిన్న కీటకాలు వంటివి నివసిస్తాయి. అలాంటి సమయంలో మొక్కలను తాగడం వాటి పువ్వులు కోయడం వంటివి చేస్తే ఆ చిన్న జీవ రాషులకు మనం ఇబ్బంది కలిగించినట్టే అవుతుందని అంటున్నారు. అంతేకాకుండా సమయంలో పూల సువాసన తాజాదనం రెండు కూడా తగ్గుతాయి.

అలాంటి పువ్వులను దేవుడికి సమర్పించినా కూడా ఇలాంటి ఫలితం లభించదు. అందుకే సాయంత్రం సమయంలో దేవుడు కోసం అయినా సరే పువ్వులను కోయకూడదని అంటూ ఉంటారు. సైన్స్ పరంగా చూసుకుంటే రాత్రి సమయంలో మొక్కలు కార్బన్డయాక్సైడ్ ను ఎక్కువ మొత్తంలో విడుదల చేస్తాయి. కాబట్టి ఆ సమయంలో వాటిని తాకడం లేదంటే ఆ చెట్ల కింద పడుకోవడం లాంటివి అస్సలు చేయకూడదట. సాయంత్రం సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పురుగులు కీటకాలు వంటివి చెట్ల కింద ఉండే అవకాశం ఉంటుందట. అలాంటి సమయంలో చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాటి నుంచి ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.