నవరాత్రుల వేళ దుర్గా మాత విగ్రహాలను ప్రతిష్టించి భక్తులు పూజలు చేస్తుంటారు. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడంపై దృష్టిపెడతారు. ఇలా ప్రతిష్టించే దుర్గా మాత విగ్రహాలను తయారు చేసేందుకు వేశ్య గృహాల్లోని మట్టిని వాడతారంట. వినడానికి వింతగా ఉన్నా.. ఇదే నిజమట. అయితే దీని వెనుక కొన్ని రహస్యాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సెక్స్ వర్కర్లుగా పని చేసే వారు మరియు వేశ్య గృహాల్లో నివసించే మహిళలను ప్రపంచం చిన్నచూపు చూస్తుంటుంది. అలాంటి వారి ఇంటి నుంచి సేకరించే మట్టికి దుర్గమ్మ విగ్రహ తయారీలో అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.
ఇందుకు ఒక కారణం ఉంది. అదేమిటంటే.. చాలా మంది సెక్స్ వర్కర్లు గా మారే ముందు.. తమ ఇళ్లలో నుంచి బయటికి వచ్చే సమయంలో పవిత్రతను, కాఠిన్యాన్ని ఇంటి దగ్గరే వదలేసి వస్తారని నమ్ముతారు. ఇంటి గడప దాటిన తర్వాత.. వేశ్య వృత్తిని చేపట్టిన తర్వాత వాళ్ళు పాపం, దుర్మార్గపు ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. ఈవిధంగా సమాజంలో అగౌరవానికి గురైన మహిళలకు ప్రజలందరూ గౌరవం ఇవ్వాలనే సందేశాన్ని ఇచ్చేందుకు వేశ్యగృహం నుండి మట్టిని తీసుకుంటారట.
మరో కారణం ఇది..
ఇలా చేయడానికి మరో కారణం కూడా ఉందట. అదేంటంటే.. దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించే సమయంలో.. అతను ఆమెను తాకి, వేధించడానికి ప్రయత్నించాడట. దీంతో ఆ దేవతకు కోపం వచ్చి తన శక్తిని మరియు పరాక్రమాన్ని ఉపయోగించి ఆ రాక్షసుడిని సంహరించిందట.
ఇలా సేకరిస్తారు..
దుర్గాదేవి విగ్రహాన్ని వేశ్య గృహాల్లోని మట్టితో తయారు చేసేందుకు.. వారు నివసించే స్థలాలకు వెళ్లి.. మట్టి ఇవ్వమని వారిని వేడుకోవాలట. అప్పుడే వారు పూజారికి మట్టిని ఇస్తారట. ఆ సమయంలో పూజారులు ప్రత్యేక మంత్రాలు జపిస్తారు.