Temple: దేవాలయాలకు ఏ సమయంలో వెళ్లి పూజ చేయాలో మీకు తెలుసా?

మామూలుగా మనం తరచుగా గుడికి వెళ్లి దేవుడుని దర్శనం చేసుకుంటూ ఉంటాం. కొందరు వారానికి ఒకటి లేదా రెండు సార్లు వెళితే మరి కొందరు ప్రతిరోజు గ

  • Written By:
  • Publish Date - June 27, 2024 / 04:46 PM IST

మామూలుగా మనం తరచుగా గుడికి వెళ్లి దేవుడుని దర్శనం చేసుకుంటూ ఉంటాం. కొందరు వారానికి ఒకటి లేదా రెండు సార్లు వెళితే మరి కొందరు ప్రతిరోజు గుడికి వెళుతూ ఉంటారు. ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఆలయాలకు వెళ్తూ ఉంటారు. అయితే దేవాలయాలకు వెళ్లడం మంచిదే కానీ, ఏ సమయంలో వెళ్లాలి అన్న విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. కొన్ని ఆలయాలకు కొన్ని సమయాలలో మాత్రమే వెళ్లి దర్శనం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చట.

మరి ఆలయాలకు ఎటువంటి సమయంలో వెళ్లాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శ్రీహరిని అలాగే పరమేశ్వరుని దర్శించడానికి సరైన సమయం ఉదయం. ముఖ్యంగా శ్రీహరిని పూజించాలి అనుకున్న వారు ఉదయాన్నే ఆలయానికి వెళ్లడం మంచిది. ఉదయం శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకోవడం ఎంతో మంచిది. ఇక పరమేశ్వరుడి ఆలయాన్ని మాత్రం సంధ్య సమయంలో దర్శనం చేసుకోవడం శుభప్రదం. పరమేశ్వరుడు లయకారకుడు,, కాబట్టి ఈయనని సంధ్య సమయంలో పూజ చేసుకోవడం ఎంతో మంచిది. ఈ విధంగా రోజు పూర్తి అవుతున్న సమయంలో పరమేశ్వరుడిని పూజించుకోవడం వల్ల మనకు రెట్టింపు ఫలితాలు ఉంటాయి.

అందుకే ఉదయం మహావిష్ణువు సాయంత్రం పరమేశ్వరుడిని దర్శించుకోవడం వల్ల శుభం కలుగుతుంది. ఇకపోతే మనం ఏ ఆలయానికి వెళ్ళిన తొందరగా స్వామివారి దర్శనం చేసుకోవాలనే నియమ నిబంధనలను అతిక్రమించి స్వామివారిని దర్శనం చేసుకోకూడదు. ఇలా చేస్తే ఆలయానికి వెళ్ళిన ఫలితం కూడా మీకు లభించదు. కాబట్టి ఏ ఆలయానికి వెళ్ళినా కూడా నెమ్మదిగా నిదానంగా మనశ్శాంతిగా ఆ దేవుడిని మనసులో తలుచుకుంటూ, పాజిటివ్ ఆలోచనలతో స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉండటమే కాకుండా మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.