భారతీయులకు గంగానది అన్నా గంగాజలం అన్నా చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఇంటిని శుభ్రం చేసుకోవడానికి కూడా గంగాజలాన్ని చల్లుతూ ఉంటారు. ఏదైనా ఆలయాలకు పుణ్య ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నదులలో స్నానాలు చేస్తూ ఉంటారు. అలా ఏదైనా పుణ్య నదులకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి గంగాజలాన్ని తీసుకువస్తూ ఉంటారు. అలా తీసుకువచ్చిన గంగాజలాన్ని ఇల్లు మొత్తం చల్లి ఇంట్లో ఇలాంటి దుష్ట శక్తులు ఉండకూడదని కోరుకుంటున్నారు. ఇలా తీసుకువచ్చిన గంగాజలాన్ని చాలామంది ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఆ గంగా జలాన్ని ఏ దిశలో పెట్టాలి అన్న విషయం తెలియదు. అందుకే దేవుడు గదిలో పెడుతూ ఉంటారు. ఇంతకీ గంగా జలాన్ని ఏ దిశలో పెట్టాలి ఏ దిశలో పెడితే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కుంభమేళాకు వెళ్లిన వారు తప్పకుండా వారితో పాటు అక్కడ కొన్ని నీటిని తీసుకువస్తూ ఉంటారు. ఆ నీటిని ఇతరులకు కూడా దానం చేస్తూ ఉంటారు. ఆ పుష్కర జలాలలో అమృత బిందువులు కలిసి ఉంటాయని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ పుష్కర జలాన్ని ఇంటికి కూడా తెచ్చుకుంటారు. ఏదైనా పండుగ, శుభకార్యం అంటే ఈ గంగాజలం వాడతారు. ఇంటికి ఏదైనా అంటు, ముట్టు కలిశాక ఇంటిని శుద్ది చేసుకుంటే గంగాజలం చల్లి ఇంటిని సంప్రోక్షణ చేసుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారం గంగాజలాన్ని ఇంటిలో దేవుడి గదిలో ఉంచితే మంచిది. గంగాజలాన్ని దేవుడి గదిలో ఉంచడం వల్ల దేవతల ఆశీర్వాదం, దేవతల శక్తి, పాజిటివ్ ఎనర్జీ, ఇంట్లో సామరస్య వాతావరణం ఏర్పడుతుందని చెబుతుంటారు. గంగాజలాన్ని చాలామంది ప్లాస్టిక్ బాటిల్స్ లో పెట్టి అలాగే ఉంచేస్తూ ఉంటారు.
ఇలా చేయడం అసలు మంచిది కాదు. గంగాధలని ఎప్పుడైనా సరే దేవుడు గదిలో పెట్టేటప్పుడు రాగి లేదా ఇత్తడి లేదా వెండి మట్టి పాత్రలలో మాత్రమే ఉంచాలని చెబుతున్నారు. పుణ్యక్షేత్రాల నుండి గంగా జలాన్ని తీసుకుని రావడం అందరూ చేస్తారు. దాన్ని పూజ గదిలో ఉంచుతారు. కానీ దాన్ని అలాగే పూజ గదిలో ఉంచడం కాదు. వారానికి ఒకసారి, పది రోజులకు ఒకసారి లేదా పండుగల సమయంలో ఇల్లంతా శుభ్రం చేశాక గంగాజలాన్ని కొన్ని నీటిలో కలిపి ఇల్లంతా చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోతుందట. అలాగే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. వాస్తుప్రకారం ఇంట్లో గంగాజలం చల్లుకోవడం వల్ల వాస్తు సమస్యలు తొలగిపోతాయట. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయని చెబుతున్నారు.