Vastu :దూర్వ మొక్క ఇంట్లో ఏ దిక్కున ఉంటే ఐశ్వర్యం కలుగుతుందో తెలుసా?

  • Written By:
  • Publish Date - November 30, 2022 / 06:38 AM IST

దూర్వ మొక్క. వినాయకుని ఆరాధనలో ప్రత్యేక ప్రాముఖ్యం ఉంటుంది. ఈ మొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దుర్వ మొక్కను ఇంట్లో పెంచుకుంటే అంతామంచి జరుగుతుందని నమ్మకం. అయితే ఇంట్లో దూర్వ మొక్కను పెట్టే ముందు ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో తెలుసుకుందాం.

ఇంట్లో ఉండే ప్రతి వస్తువు వాస్తు ప్రకారం ఉన్నట్లయితే ఆ ఇంట్లోకి ఐశ్వర్యం వస్తుంది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది. వాస్తులో ప్రతి వస్తువుకు ప్రత్యేక స్థానం ఉన్నట్లే…మొక్కలకు కూడా ఉంటుంది. ఇంట్లో తులసి ఉంటే ఆనందం శ్రేయస్సు ఉంటుంది. మనీ ప్లాంట్ ఉంటే సంపదను ఆకర్షిస్తుంది. అదే విధంగా దుర్వా గడ్డి మొక్క ఉంటే మిమ్మల్ని ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి రక్షిస్తుంది.

ఇంట్లో దూర్వ మొక్కను ఎక్కడ పెంచాలి.
వాస్తు ప్రకారం ఈ మొక్కను నాటేందుకు ప్రత్యేకమైన మార్గదర్శకాలు, నియమాలు ఉన్నాయి. ఈ మొక్క మీ ఇంట్లో నాటాలంటే కొన్ని అంశాలను ద్రుష్టిలో ఉంచుకోవాలి. ఇంట్లో తూర్పు లేదా ఉత్తర మూలలో ఈ దూర్వ మొక్కను ఉంచాలి. ఈ మొక్కను దక్షిణ దిశలో ఉంచకూడదు. ఇలా ఉంచితే దురద్రుష్టాన్ని తెస్తుంది. వాస్తు ప్రకారం దూర్వ మొక్కను ఏదైనా తప్పుడు ప్రదేశంలో ఉంచితే…ఆ ఇంట్లో అశాంతి నెలకొంటుంది. దూర్వ మొక్కను తూర్పు లేదా ఉత్తరదిశలో నాటితే..దానికి సరైన వెలుతురు వచ్చేలా చూడాలి.

ఈ మొక్కకు క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. ఎందుకంటే ఈమొక్కను పొడిగా ఉంచకూడదు. ఎండ తగిలే ప్రదేశంలో ఉంచాలి. ఈ నియమాలు పాటిస్తే..దుర్వా మొక్క మీ ఇంటికి అదృష్టాన్ని తెస్తుంది. ఈ మొక్క ఆకులు పచ్చగా ఉంటే ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది.

సానుకూల శక్తిని పెంచుతుంది
వాస్తు ల ప్రకారం, దుర్వా మొక్క సానుకూల శక్తిని పెంచుతుది. ఇంటి ఈశాన్య మూలలో దుర్వా మొక్కను నాటాలి. ఇంట్లోని దేవుడి గది చుట్టూ మొక్క ఉంటే మంచి ఫలితం ఉంటుంది. మీరు ఇంట్లో ప్రేమ సామరస్యం ఉండాలంటే ఇంటికి ఆగ్నేయ మూలలో ఒక దుర్వా మొక్కను నాటండి.

మీరు ఇంట్లో శాంతిని కాపాడుకోవాలనుకుంటే దుర్వా మొక్కను నాటడానికి ఇంటి నైరుతి మూలను ఎంచుకోవాలి. మీ చదువులు లేదా వృత్తిలో విజయం సాధించాలనుకుంటే, మీరు మీ డెస్క్‌పై దుర్వా మొక్కను ఉంచాలి. మీరు మీ ఆఫీసు డెస్క్‌పై వినాయకుడు దుర్వా మొక్క, చిన్న విగ్రహాన్ని కూడా ఉంచవచ్చు. ఈ మొక్కను ఎల్లప్పుడూ మట్టి లేదా రాగి కుండలో ఉంచాలి.