Vasthu Tips: మామూలుగా వాస్తు ప్రకారం ఇంట్లో చాలామంది రకరకాల మొక్కలు చెట్లను పెంచుకుంటూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని రకాల మొక్కలు పెంచుకోవడం సరైనది కాదు అని చెబుతున్నారు. కొన్ని చెట్లను పెంచుకున్నప్పటికీ వాటి విషయంలో వాస్తు నియమాలు పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. కొందరు ఇంట్లో అరటి చెట్టును పెంచుకుంటూ ఉంటారు. అయితే అలాంటి వారు వాస్తు నియమాలు తప్పకుండా పాటించాలట.
మరి అరటి చెట్టు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అరటి చెట్టును ఎక్కువగా దేవాలయాలు, ఇంటి అలంకరణ, పూజ సమయంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక ఏ పూజలో అయినా సరే అరటి పండు తప్పకుండా ఉంటుంది. ఇది శుభానికి చిహ్నం కాబట్టి. చాలా మంది అరటి పండును పూజలో తప్పక ఉపయోగిస్తారు. ఇక అలంకరణలో అరటి ఆకులు ఉపయోగించడం వలన సానుకూల శక్తి పెరుగుతుంది. ఇక హిందూ మతం ప్రకారం అరటి చెట్టు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది ఎవరి ఇంటిలో అయితే ఉంటుందో, వారి ఇంటిలో ఆనందం, శ్రేయస్సు నెలకొంటుందని నమ్మకం.
అందుకే చాలా మంది దీనిని ఇంటిలో నాటుకుంటూ ఉంటారు. అయితే దీనిని ఇంటిలోపల ఏదిశలో నాటడం శుభప్రదం అని చాలా మందికి తెలియదు. వాస్తు శాస్త్రం ప్రకారం అరటి చెట్టును ఇంటి లోపల ఈశాన్య దిశలో నాటడం చాలా మంచిదట. దీని వలన ఆర్థికంగా కలిసి రావడమే కాకుండా లక్ష్మీదేవి, విష్ణు మూర్తి ఆశీస్సులు లభిస్తాయట. ఈశాన్యంలో అరటి మొక్క నాటడం వలన ఇది కుటుంబంలో సానుకూల శక్తిని పెంచడంతో పాటు సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని పెంపొందిస్తుందట. ముఖ్యంగా గురువారం రోజున అరటి మొక్కకు పసుపు,కుంకుమ సమర్పించి, దీపం వెలిగించి పూజించడం వలన లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుగ్రహం లభించి, గ్రహ అడ్డంకులు తొలిగిపోతాయట. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు.
Vasthu Tips: ఇంట్లో అరటి మొక్కను పెంచుకుంటున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే?
Vasthu Tips: ఇంట్లో అరటి మొక్కను పెంచుకునేవారు తప్పకుండా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని ముఖ్యంగా వాస్తు నియమాలు పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు ఆధ్యాత్మిక పండితులు.

Vasthu Tips
Last Updated: 08 Dec 2025, 07:20 AM IST