Arunachalam : ఏ రోజుల్లో అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే ఎక్కువ పుణ్యం లభిస్తుంది మీకు తెలుసా?

  • Written By:
  • Updated On - April 13, 2024 / 03:26 PM IST

Arunachalam : తమిళనాడు(Tamil Nadu)లో ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది అరుణాచలం(Arunachalam). దీన్ని తమిళులు.. తిరువణ్ణామలై(Tiruvannamalai) అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న పెద్ద కొండని సాక్షాత్తూ శివలింగంగా భక్తులు భావిస్తారు. అందుకే అరుణాచలంలోని పరమేశ్వరుణ్ణి(Lord Shiva) దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఇంతకీ.. ‘గిరి ప్రదక్షిణ’ ఏ రోజుల్లో చేస్తే ఎక్కువ పుణ్యఫలం దక్కుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఏడాది అనుకూలమైన రోజులేవి? ఎలా చేరుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join.

పౌర్ణమి రోజుల్లో అరుణాచ గిరి ప్రదక్షిణ చేస్తే ఎక్కువ పుణ్యఫలం దక్కుతుందని, కోరిక కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. చంద్రుడు ఆ రోజు పదహారు కళలతో ప్రకాశిస్తూ ఉంటాడట. కాబట్టి, ఆ వెలుగులో గిరి ప్రదక్షిణ చేస్తే.. మానసిక, శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

గిరి ప్రదక్షిణంకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

.గిరి ప్రదక్షిణం చేసే వారు పాదరక్షలు లేకుండా వెళ్లడం మంచిది.
.చెప్పులు లేకుండా గిరి వాలం చుట్టి వస్తే పుణ్యప్రధమని భక్తులు విశ్వసిస్తారు.
.బరువు ఎక్కువగా ఉండే బ్యాగులను తీసుకెళ్లకపోవడం మంచిది.
.గిరి ప్రదక్షిణ చేయాలంటే దాదాపు 14 కిలోమీటర్ల వరకు నడవాల్సి ఉంటుంది.
.వీలైతే ఉదయం 10 గంటలలోపు గిరి ప్రదక్షిణాన్ని ముగించుకుంటే మంచిది.
.భక్తులు తమ వెంట పండ్లు, నిమ్మకాయలను తీసుకెళ్లడం ఉత్తమం.

Read Also: Mall : మాల్‌లో క‌త్తిపోట్ల క‌ల‌క‌లం.. న‌లుగురి మృతి!

కాగా, తిరుపతి నుంచి 193 కిలోమీటర్ల దూరంలో అరుణాచలం ఉంది. బెంగళూరు నుంచి 202 కిలోమీటర్ల దూరంలో.. చెన్నై నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు, రైలు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.