Site icon HashtagU Telugu

Solar Eclipse 2025 : 2025లో ఏర్పడబోయే సూర్యగ్రహణాల గురించి తెలుసా ?

First Solar Eclipse In 2025 Zodiac Signs

Solar Eclipse 2025 : 2025 సంవత్సరం రాబోతోంది. కొత్త ఏడాది శుభప్రదంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. సూర్య, చంద్ర గ్రహణాల ప్రభావం ప్రతి ఒక్కరి జాతకంపై  పడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గ్రహణాల టైంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రజలు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరంలో(Solar Eclipse 2025) ఏర్పడబోయే సూర్య గ్రహణాల సమాచారంతో కథనమిది.

Also Read :Naked Art Exhibition : నగ్నంగా వస్తేనే ఎంట్రీ.. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ వెరీ స్పెషల్

భూమి, సూర్యుడి కక్ష్యలోకి చంద్రుడు వచ్చి సూర్యుడిని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పేయడాన్ని సూర్యగ్రహణం అంటాం. ఆ టైంలో సూర్యుడు కనిపించకపోవడంతో భూమిపైకి వచ్చే సూర్య కాంతి తగ్గిపోతుంది. అమావాస్య రోజుల్లో సూర్య గ్రహణం సంభవిస్తుంది. అయితే ప్రతీ అమావాస్యలో గ్రహణాలు ఏర్పడవు. 2025 సంవత్సరం విషయానికొస్తే.. రెండు సూర్యగ్రహణాలు ఏర్పడబోతున్నాయి. ఆ ఏడాదిలో మొదటి సూర్య గ్రహణం మార్చి 29న మధ్యాహ్నం 2:20 గంటలకు ఏర్పడి సాయంత్రం 6:13 వరకు ఉంటుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం. అయితే మన దేశంలో ఇది కనిపించే అవకాశాలు లేవు.  దీంతో దానికి మతపరమైన ప్రాముఖ్యత ఉండదు. ఫలితంగా ఆ రోజున మనకు సూతక్ కాలం వర్తించదు. ప్రజలు సాధారణ జీవితాన్ని గడపొచ్చు. ఇక రెండో సూర్య గ్రహణం సెప్టెంబరు 21న ఏర్పడుతుంది. ఇది కూడా పాక్షిక సూర్య గ్రహణమే. ఇది మన దేశంలో కనిపిస్తుంది. ఆ రోజున సూతక్ కాలం మనకు వర్తిస్తుంది. నియమాలను పాటించాల్సి ఉంటుంది.

సూర్య గ్రహణానికి 12 గంటల ముందు సూతక్ కాలం మొదలవుతుంది. గ్రహణ కాలం ముగిసిన తర్వాత ఇది ముగుస్తుంది. 2024 సంవత్సరాన్ని సంగ్రాహలోకనం చేస్తే..  ఈ ఏడాదిలో మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడ్డాయి. వాటిలో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు.

Also Read :TATA Motors : పుణెలో అధునాతన రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ కేంద్రం Re.Wi.Reని ప్రారంభించిన టాటా మోటార్స్

గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.