Spiritual: మాములుగా మనం ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం. కొందరు రోజు చేస్తే మరికొందరు వారంలో కొన్ని ప్రత్యేకరోజుల్లో మాత్రమే చేస్తుంటారు. అయితే పూజ ఎప్పుడు చేసిన కూడా కొన్ని సార్లు దీపం లోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మరికొన్ని సార్లు మాత్రం అందులో ఉన్న నూనె మొత్తం అయిపోయి కేవలం ఒత్తి మాత్రమే మిగులుతూ ఉంటుంది. ఇలా దీపంలోని వత్తులు మిగిలి పోయినప్పుడు చాలా వరకు వాటిని పడేస్తూ ఉంటాం.
కొందరు వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వ్యతిరేస్తే మరి కొందరు వాటిని తీసుకొని వెళ్లి నీటిలో పడేస్తూ ఉంటారు. కానీ ఇవి రెండు పనులు చేయడం తప్పు అని అంటున్నారు పండితులు. మరి ఇవి తప్పు అయితే ఏది ఒప్పు? దీపంలో మిగిలిపోయిన వత్తులు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత దీపంలో మిగిలిపోయిన వత్తులను పారేయకూడదట. ఎందుకంటే అలా కాలిపోయిన ఒత్తులు సానుకూల శక్తిని కలిగి ఉంటాయట. కాబట్టి వాటిని చెత్తలో పడేయకూడదని చెబుతున్నారు.
దీనికి బదులుగా మీరు ప్రతిరోజు దీపారాధన చేస్తున్నట్లయితే దాదాపు పది రోజులపాటు అలా దీపంలో మిగిలిపోయిన వత్తులను సేకరించి ఒకచోట ఉంచాలట. అలా పది రోజులపాటు సేకరించిన ఆ వత్తులను 11వ రోజు ఏదైనా ఒక ప్రమిద తీసుకొని అందులో లవంగాలు కర్పూరాన్ని వేసి కాల్చాలట. అలా వేసి ఆ దూపంని ఇల్లంతా తిప్పాలట. అలా కాల్చగా వచ్చిన బూడిదని మరుసటి రోజు ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలట. ఆ బూడిదను పిల్లలకు దిష్టి తగలకుండా పెట్టవచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా ఆ బూడిదతో దిష్టి కూడా తీయవచ్చట. అలాగే మీరు ఏదైనా ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్తున్నప్పడు ఆ బూడిదని నుదిటిన ధరించి బయటకు వెళ్లడం వల్ల వెళ్లిన పని విజయవంతం అవుతుందట. ఒకవేళ ఇంకా కొంచెం బూడిద మిగిలితే దానిని చెట్టు మొదట్లో వేయాలని చెబుతున్నారు.
Spiritual: దీపం కొండెక్కిన తర్వాత వత్తులను ఏం చేయాలో తెలుసా? వత్తులు పాడేయకూడదట!

Spiritual