Rahu Time Period : రాహు కాల సమయంలో మనం ఎలాంటి శుభకార్యాలు లేదా మంగళకరమైన పనులు చేయడం నిషిద్ధం. వారంలో 7 రోజులు అంటే ఆదివారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు రాహుకాలం ఏ సమయంలో ఉంటుంది.?
హిందూ గ్రంధాలలో రాహువును (Rahu) రాక్షస రూపంలో ఉన్న సర్పానికి అధిపతిగా భావిస్తారు. రాహువు తామస గుణం కలిగిన రాక్షసుడు. సాధారణంగా మనం రాహు కాలాన్ని పగటిపూట గుర్తిస్తాం. ఇది జ్యోతిషశాస్త్రంలోను, హిందూ ధర్మంలోనూ అశుభమని పరిగణిస్తారు. దీని కారణంగానే రాహు కాలంలో ఎలాంటి శుభకార్యాలు లేదా పూజ కార్యక్రమాలు నిషేధించారు.
చాలా మంది ఏదైనా శుభకార్యానికి ఇంటి నుంచి బయలుదేరినప్పుడు లేదా మరేదైనా పనికి వెళుతున్నప్పుడు రాహు (Rahu) కాలాన్ని చూసుకుని బయలుదేరుతారు. ఎందుకంటే ఈ సమయంలో చేసే మంచి పనులు కూడా అశుభ ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రోజులో కొద్ది సమయం ఏవిధమైన శుభకార్యాలు చేయడం నిషిద్ధం. ఎందుకంటే రాహుకాలాన్ని అశుభంగా పరిగణిస్తారు. ఈ ముహూర్తంలో ఏ పని చేయడం కూడా మంచిది కాదు.
We’re now on WhatsApp. Click to Join.
రాహుకాలంలో చేసిన ఏ పనైనా సఫలం కానేకాదంటారు. లేదా ఆ వ్యక్తికి వివిధ రకాల సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందంటారు. అసలు మొత్తం రోజులో రాహుకాలం ఎప్పుడుంటుంది, రాహుకాలంలో ఏ పని చేయాలి, ఏది చేయకూడదనేది పరిశీలిద్దాం. రోజు మొత్తంలో రాహుకాలం ఉంటుంది. అందుకే రాహుకాలం ఎప్పుడనేది లెక్కిస్తుంటారు. రాహుకాలం ఏరోజుకా రోజు మారుతుంటుంది.
జ్యోతిష్యం ప్రకారం రాహుకాలానికి అధిపతి గ్రహం రాహువే (Rahu). అశుభ ఫలాల్ని అందిస్తుంటాడు. ప్రతిరోజూ ఓ గంటన్నర రాహుకాలముంటుంది. జ్యోతిష్యుల ప్రకారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో 8వ భాగం రాహుకాలంగా పరిగణిస్తారు. ఆదివారం నుంచి శనివారం వరకు రాహుకాలం ఏ సమయంలో ఉంటుందో తెలుసా? ఏ సమయాన్ని రాహుకాలంగా పరిగణిస్తారు..?
ఆదివారం నుంచి శనివారం వరకు రాహుకాలం (Rahu Time Period)..
ఆదివారం రాహు కాల సమయం:
రాహుకాలం ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:00 గంటల వరకు ఉంటుంది.
సోమవారం రాహు కాల సమయం:
సోమవారం రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9:00 గంటల వరకు ఉంటుంది
మంగళవారం రాహు కాల సమయం:
మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు ఉంటుంది.
బుధవారం రాహు కాల సమయం:
బుధవారం రాహుకాలం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు ఉంటుంది
గురువారం రాహు కాల సమయం:
గురువారం రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు ఉంటుంది.
శుక్రవారం రాహు కాల సమయం:
శుక్రవారం రాహుకాలం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది
శనివారం రాహు కాల సమయం:
శనివారం రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు ఉంటుంది.
వారంలో 7 రోజులు ఈ సమయంలో రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో శుభ కార్యాలు లేదా మంగళ కార్యాలు చేయడం నిషిద్ధం. మీరు ఏదైనా పని చేయబోతున్నట్లయితే, నిపుణులైన జ్యోతిష్కులు లేదా పండితుల సలహా తీసుకొని పనిని ప్రారంభించండి.
Also Read: Durga Temple EO : దసరా ఉత్సవాల వేళ దుర్గగుడి ఈవో బదిలీ.. రాజకీయ ఒత్తిళ్లే కారణమా..?