Site icon HashtagU Telugu

Naga Panchami 2024: నాగ పంచమి రోజు పొరపాటున కూడా ఈ పనులను అస్సలు చేయకండి.. అవేంటంటే?

Naga Panchami 2024

Naga Panchami 2024

హిందువులు జరుపుకునే పండుగలు నాగపంచమి పండుగ కూడా ఒకటి. శ్రావణమాసంలోని నాగుల చవితి నెలలో ఈ నాగ పంచమి పండుగ వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నాగ పంచమి రోజున భక్తులు నాగదేవతను భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా పుట్టకు అలాగే నాగుల కట్టకు పాలు పోసి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. ఇక ఈసారి కూడా నాగ పంచమి రోజు రానే వచ్చింది.. ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీ శుక్రవారం రోజున నాగపంచమి పండుగను జరుపుకోనున్నారు. అయితే నాగ పంచమి రోజున చాలామంది తెలిసి తెలియక కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. దీనివల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి.

ముఖ్యంగా నాగపంచమి రోజున కొన్ని పనులు చేయడం నిషేధించబడింది అంటున్నారు పండితులు. మరి నాగ పంచమి రోజు ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నాగ పంచమి రోజు పాములకు హాని తలపెట్టే పనులు చేయకూడదని చెబుతున్నారు. ఇంటి దగ్గరకు లేదా సమీపంలో ఎక్కడైనా పాము కనిపిస్తే దానిని చంపడం కర్రలతో కొట్టడం లాంటివి చేయకూడదని చెబుతున్నారు. అలాగే స్త్రీలు నాగ పంచమి రోజు వంటలు చేసేటప్పుడు పాన్ పై చేసే వంటకాలు కాకుండా కేవలం నాగ పంచమి రోజు ఉడికించిన ఫుడ్ మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు పండితులు. ఇక నాగ పంచమి రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకొని భక్తిశ్రద్ధలతో నాగదేవతకు పూజలు చేయాలని చెబుతున్నారు..

చాలామంది పల్లెటూళ్లలో ఉండే వారు చేసే అతిపెద్ద పొరపాటు నాగపంచమికి పుట్టలో పాలు పోయడం. పుట్టలో పాలు అసలు పోయకూడదట. ఎందుకంటే పాలు పాములకు విషంతో సమానమట.. కాబట్టి పుట్టలో పాలు పోవడానికి బదులుగా విగ్రహాలకు పాలాభిషేకం చేయడం మంచిదని చెబుతున్నారు. అలాగే నాగ పంచమి రోజు ఆకుకూరలు కోయడం కత్తిపీటలు, చాకలు వాడడం లాంటివి చేయకూడదట. నాగపంచమి రోజు భూమిని దున్నడం లేదా పొలాన్ని దున్నడం లాంటివి అస్సలు చేయకూడదట. పైన చెప్పిన విషయాలు తప్పకుండా పాటించాలని లేదంటే అనేక రకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు పండితులు..