Lakshmi : లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఇంటి మెయిన్ డోర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసా?

ల‌క్ష్మీదేవి (Lakshmi) ఇంట్లోకి ప్రవేశిస్తోంద‌ని గుర్తుచేసుకుంటూ మీ ఇంటి ప్రధాన ద్వారంపై లక్ష్మీదేవి పాదాల అందమైన చిత్రాన్ని ఉంచడం వల్ల అంతా మంచే జరుగుతుంది.

  • Written By:
  • Publish Date - November 23, 2023 / 06:40 PM IST

Goddess Lakshmi : వాస్తు విషయాలను బాగా పాటించేవారు ఇంటి ప్రధాన ముఖ ద్వారం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. ఎటువంటి వస్తువులు గుమ్మం దగ్గర ఉంచాలి ఎటువంటి వస్తువులు ఉంచకూడదు? అలాగే ప్రధాన ముఖ ద్వారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇలా ఎన్నో విషయాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. మరి వాస్తు ప్రకారంగా ప్రధాన ముఖద్వారం విషయంలో ఎటువంటి విషయాలను గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద వినాయకుడి ప్ర‌తిమ ఉంచాలి. ఇలా చేయడం వల్ల విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి.

We’re Now on WhatsApp. Click to Join.

అలాగే గణేశుడి ప్ర‌తిమ ఉంచ‌డం ద్వారా ఇంట్లో ప్రతికూలత తొలగిపోతుంది. ఆగిపోయిన పనులు కూడా ప్రారంభం అవుతాయి. అయితే ప్రధాన ద్వారం వద్ద గణపతిని ఉంచడంతోపాటు ప్రతిరోజు ఆయనను పూజించాలి. అలా చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. చాలామంది ప్రధాన ద్వారం వద్ద అనేక రకాల పూల మొక్కలను అందంగా అలంకరిస్తూ ఉంటారు. అలా అందమైన పూల మొక్కలను ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల అది ఇంటికి అందాన్ని పెంచుతుంది. ఆ పువ్వుల సువాసనతో సానుకూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇంటి వెలుపల అందమైన పూల మొక్క‌లు ఉంచ‌డం వల్ల మీ జీవితంలోని అన్ని సమస్యలు తొల‌గిపోతాయి, ఇంట్లో ఆర్థిక సమ‌స్య‌లు కూడా ఉండవు. ల‌క్ష్మీదేవి (Lakshmi) ఇంట్లోకి ప్రవేశిస్తోంద‌ని గుర్తుచేసుకుంటూ మీ ఇంటి ప్రధాన ద్వారంపై లక్ష్మీదేవి పాదాల అందమైన చిత్రాన్ని ఉంచడం వల్ల అంతా మంచే జరుగుతుంది.

ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి (Lakshmi) అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇంటి ఆర్థిక పరిస్థితి ఎప్పటికీ క్షీణించదు. ఆర్థిక లాభాలు కూడా చేకూరుతాయి. హిందువులు తులసి మొక్కను పరమపవిత్రంగా భావించడంతోపాటు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. తులసి మొక్క చాలా శుభప్రదమైనది. ఇంటి బయట నాటితే, అది ఇంటికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. గృహంలో ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే స్వస్తిక్‌, ఓం చిత్రాల‌ను ప్ర‌ధాన ద్వారంపై ఉంచాలి. ఓం శబ్దం, దాని ప్రకాశం ఇంట్లోని వ్య‌క్తుల‌పై సానుకూల ప్ర‌భావం చూపుతుంది.

Also Read:  Kidney Failure: మూత్రపిండాల వైఫల్యం యొక్క లక్షణాలు