Site icon HashtagU Telugu

Makar Sankranti 2024: సంక్రాతి పండుగ రోజు ఎటువంటి వస్తువులు దానం చేయాలో మీకు తెలుసా?

Mixcollage 11 Jan 2024 04 20 Pm 377

Mixcollage 11 Jan 2024 04 20 Pm 377

హిందువులు కొత్త ఏడాది జరుపుకునే మొట్టమొదటి పండుగ సంక్రాంతి. అంతే కాకుండా హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలను సంక్రాంతి కూడా ఒకటి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఇక ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి పండగ జనవరి 14,15,16 తేదీలలో వచ్చింది. 14వ తేదీ భోగి 15వ తేదీ సంక్రాంతి 16వ తేదీ కనుమ పండుగను జరుపుకోనున్నారు. సంక్రాంతిని ఉత్తరాయణగా కూడా పిలుస్తారు. ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడని చెబుతారు.

సంక్రాంతి రోజున భక్తులు గంగా, యమునా, గోదావరి, కృష్ణా, కావేరీ లాంటి పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆరచిస్తారు. ఇలా పుణ్యస్నానాలు ఆచరిస్తే వారు చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అయితే ఈ సంక్రాంతి పండుగ రోజున కొన్ని రకాల దానాలు చేయడం చాలా మంచిది అంటున్నారు పండితులు. కొందరు సంక్రాంతి పండుగ రోజు గుమ్మడికాయను దానం చేస్తూ ఉంటారు. దీంతో పాటు ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, చెరకు, గోవు, బంగారం ఇలా ఎవరి శక్తి కొద్దీ వారు దానం చేస్తారు. ఇలా దానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.

అలాగే కొత్త బియ్యంతో పరమాన్నం, అరిసెలు వంటి పిండివంటలు చేసి శ్రీమహావిష్ణువుకి నైవేద్యం సమర్పించడం ఆచారం. పితృదేవతలు సదా మనల్ని ఆశీర్వదిస్తుంటారు. అంత శక్తిగల వారిని ఇతర రోజుల్లో ఎలా ఉన్నా సంక్రాంతి నాడు తప్పక ఆరాధించాలని పెద్దలు చెబుతారు. పితృదేవతలకి నైవేద్యాలు సమర్పించాల్సిన పండుగ కనుక సంక్రాంతిని పెద్ద పండుగ, పెద్దల పండుగ అనికూడా పిలుస్తారు.