Site icon HashtagU Telugu

Lord Shiva: అరుణాచలం శివుడి ప్రత్యేకత ఎంటో తెలుసా.. చారిత్రక నేపథ్యం ఇదే

Fasting On Shivaratri These Can Be Eaten On Fasting.

Fasting On Shivaratri These Can Be Eaten On Fasting.

Lord Shiva: ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే అరుణాచలం  ఆలయానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది.  అక్కడ శివుడు నిండుగ నగలు ధరించి, పట్టు వస్త్రాలు ధరించి, కిరీటం పెట్టుకొని ఉంటాడు.. దానికి ఒక కారణం ఉంది. పార్వతి దేవి ఒకరోజున స్వామి వారు పక్కన కూర్చున్నపుడు స్వామి నుండి పునుగు వాసన వచ్చింది.. ఆ వాసన కి అమ్మవారు చాలా ప్రీతి చెందారు. అప్పుడు అమ్మవారు అడిగారు “మీ నుండి ఇంత సువాసన వస్తుంది మీకు పునుగు ఎక్కడ నుండి వచ్చింది” అని.. దానికి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు.

పార్వతి.. పునుగు పిల్లి వాసన వల్ల ఋషుల భార్యలు పునుగు పిల్లి వెంట పడడం జరుగుతుంది అని ఋషులు ఏదో ఒకటి చేసి వాళ్ళ భార్యలని ఆ పునుగు పిల్లి నుండి రక్షించమని నను అడిగారు.. నేను సరే అన్నాను. ఇప్పుడు నేను పునిగు పిల్లి దగరకి వెళ్లి ఇలా అన్నాను “పులగా.. నీ నుండే వచ్చే ఆ సువాసన వల్ల రిషి పత్నులు ని వెంట పడడం జరుగుతుంది.. నువు వెంటనే ని ప్రాణాలని వదిలేయ్” అని అన్నాడు. దానికి అది సరే అని ఒక చిన్న కోరిక కోరుతుంది.. నా నుండి మరియు నా వంశం నుండి వచ్చేవి అన్నీ పునుగు పిల్లిలే.. వాటి నుండి వచ్చే సువాసనను నువు స్వీకరించాలి అని అడుగుతుంది.. అందుకు ఆయన అంగీకరిస్తాడు.

అప్పటినుండి ఆయన తన వంటికి పులుగు అడ్డుకోవడంతో ఆ సువాసన కి అమ్మ వారు పరవశించి ఉండేది.
అప్పుడు అమ్మవారు ఇలా అన్నారు. నువు ప్రతి చోట ఉన్నట్లు ఇక్కడ ఈ అరుణాచలం లో ఉండకూడదు.. ఒంటి నిండా నగలు వేసుకోవాలి.. పాములు ఏమి ఉండకూడదు.. నెత్తిన కిరీటం పెట్టుకోవాలని చెప్పడంతో శివుడు ఇలా దర్శనమిస్తాడు.