Site icon HashtagU Telugu

Ashada masham : ఆషాడమాసం ప్రత్యేకత ఏంటో తెలుసా..!!

Chalisa

Chalisa

ఆషాడమాసం అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. కొత్త దంపతులు, అత్త అళ్లుల్లు, అత్త కోడళ్లకే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రాశస్త్యం ఉంది. ఆషాడమాసం ఎన్నో పర్వదినాలను తీసుకువస్తుంది. పూర్వాషాడ నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది. కాబట్టి ఆషాడమాసం అంటారు. ఆధ్యాత్మికపరంగా చూసినట్లయితే ఈ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ నెలలో వచ్చే ఏకాదశిని తొలిఏకాదశిగా జరుపుకుంటారు. ఆషాడమాసంలో తెలంగాణలో బోనాలు ప్రారంభం అవుతాయి.

సూర్యుడు ఈ మాసంలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి దక్షిణాయానం ప్రారంభం అవుతుంది. పూరీక్షేత్రంలో ఆషాడశుద్ధ పాడ్యమినాడు జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తారు. ఈ మాసంలోనే స్కందపంచమి, సుబ్రమణ్యషష్టి వస్తుంది. తొలిఏకాదశి పర్వదినం కూడా వస్తుంది. మహాభారతాన్ని రచించిన వ్యాసభగవానుడిని ఆరాధించే రోజే ఆషాఢపౌర్ణమి దీన్నే గురుపౌర్ణమిగా వ్యవహరిస్తారు. ఈ మాసంలో చాతుర్మాస్య వ్రతదీక్షలు ప్రారంభం అవుతాయి. తొలిఏకాదశి నాడు క్షీరసాగరంలో పవళించిన శ్రీ మహావిష్ణువు విశ్రమిస్తాడు.

దీంతో తొలిఏకాదశిగా భక్తితో దీక్ష చేపడతుంటారు. ఎంతో విశష్టత కలిగిన సికింద్రాబాద్ శ్రీ మహంకాళి అమ్మవారి బోనాలు కూడా ఈ నెలలోనే వైభవంగా జరుగుతాయి. ఎంతో విశిష్టత, ఆధ్యాత్మికం కలిసిన విశిష్టమైన మాసం ఆషాడమాసం.

Exit mobile version